Realme GT 6: భారత్‌లోకి రియల్‌మీ కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. బ్యాటరీకి పెద్ద పీట వేస్తూ..

|

Jun 16, 2024 | 8:46 AM

బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని రోజుకో కొత్త ఫోన్‌ మార్కెట్లో సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ కంపెనీలు కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్‌మీ జీటీ6 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ఇంతకి ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌ మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రియల్‌మీ జీటీ 6 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జూన్‌ 20వ తేదీన భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్‌లోకి ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఇంతకీ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
రియల్‌మీ జీటీ6 స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్‌ జెన్‌3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌లో హీటింగ్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు డ్యూయల్‌ వీసీ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు.

3 / 5
120 వాట్స్‌ సూపర్ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల పవర్‌ఫుల్‌ బ్యాటరీని అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌ కేవలం 10 నిమిషాల్లోనే 50 శాతం, 28 నిమిషాల్లో 100 శాతం ఛార్జిగ్ అవుతుందని కంపెనీ చెబతోంది.

4 / 5
అలాగే ఈ ఫోన్‌ను సింగిల్‌ ఛార్జింగ్‌ చేసే 46 గంటల పాటు టాక్‌టైమ్‌తో పాటు ఎనిమిది గంటల గేమింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్టీపీఓ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రైమరీ సెన్సర్ కెమెరాను, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 24,200గా ఉండనుంది.