Realme 13 Pro 5G: రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్‌ ఇదే

|

Jul 21, 2024 | 7:51 PM

ప్రస్తుతం మార్కెట్లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రెడ్‌మీ 13 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ఈ నెల 30న భారత మార్కెట్లోకి రియల్‌మీ 13 ప్రో పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. రియల్‌మీ 13 ప్రో పేరుతో ఈ నెల 30వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. రియల్‌మీ 13 ప్రోతో పాటు, రియల్‌మీ 13 ప్రో+ ఫోన్‌లను విడుదల చేయనున్నారు.

2 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో సోనీ ఎల్‌వైటీ 600 లెన్స్‌ను ఇస్తున్నారు. ప్రపంచంలో ఈ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్‌ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు.

3 / 5
 1080×2412 పిక్సల్స్ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 2.4 గిగా హెర్ట్జ్ ఒక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్‌, 1 టిగా బైట్‌ స్టోరేజ్‌ ఇవ్వనున్నారు. రియల్‌ మీ నుంచి వస్తున్న తొలి ప్రొఫెషనల్‌ ఫోన్‌ ఇదే. హైపర్ ఇమేజ్+ ఫోటోగ్రఫీ ఆర్కిటెక్చర్‌ను అందించనున్నారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. ఇందులో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాను ఇవ్వనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.

5 / 5
సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‫ను ఇవ్వనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో.. 5050 ఎంఎహెచ్ కెపాసిటీ బ్యాటరీని ఇస్తున్నారు.  కలిగి ఉంటుంది. ఇంతకుముందు వచ్చిన సమాచారం మేరకు ఈ ఫోన్ అడ్రెనో 710 జీపీయూ ప్రాసెసర్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. రియల్ మీ 13 ప్రో+, రియల్ మీ 13 ప్రో ఫోన్లు మోనెట్ గోల్డ్, మోనెట్ పర్పుల్ కలర్స్‌లో తీసుకొస్తున్నారు.