Realme C53: 108 ఎంపీ కెమెరాతో రియల్‌మీ కొత్త ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?

|

Apr 05, 2024 | 3:08 PM

తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రూ. 10 వేల లోపు బడ్జెట్‌ ఫోన్‌లు ప్రస్తుతం ఎక్కువగా లాంచ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌ మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రియల్‌మీ సీ53 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ త్వరలోనే కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. రియల్‌మీ సీ53 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. బడ్జెట్‌ ధరలో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

2 / 5
ఈ ఫోన్‌లో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. గేమ్స్‌ ఆడుకోవడానికి, వీడియోలు చూడడానికి ఈ స్క్రీన్‌ సరిగ్గా సరిపోతుంది. అలాగే ఈ స్క్రీన్‌ 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో తీసుకొచ్చారు.

3 / 5
ఇక రియల్‌మీ సీ53 స్మార్ట్ ఫోన్‌ యూనిసోక్‌ టీ612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీంతో మల్టీ టాస్కింగ్ సులభంగా ఉంటుంది. గేమ్స్‌ ఆడుకునే వారికి కూడా బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

4 / 5
కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఫ్రంట్ కెమెరాకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇవ్వనున్నారు.

5 / 5
 ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 8,999కాగా, 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 7499కాగా, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 9,199గా ఉండనుందని తెలుస్తోంది.