
మొన్నటి వరకు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న రియల్‌మీ తాజాగా ప్రీమియం ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ జీటీ 2 ప్రో పేరుతో భారత్‌లో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలకు పోటీనివ్వనుంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేకంగా లార్జ్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. దీంతో స్మార్ట్ ఫోన్ త్వరగా వేడెక్కకుండా ఉంటుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ ఎల్‌టీపీఓ2 అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులోని 4500 ఎంఏహెచ్ బ్యాటరీ 65 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. మైక్రో స్కోప్ కెమెరా ఫీచర్ ఈ ఫోన్ మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియెంట్లలో విడుదల చేశారు. 8 జీబీ ర్యామ్, 1280 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 44,999కాగా, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 52,999గా ఉంది.