Pebble Smart Watch: ఇండియన్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌.. ఇదేంటి భయ్యా ఇన్ని ఫీచర్స్‌ ఉన్నాయి

|

Jul 28, 2023 | 6:05 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ పెబుల్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్‌ చేసింది. పెబుల్ రివాల్వ్‌ పేరుతో ఈ స్మార్ట్‌ వాచ్‌ను తీసుకొచ్చింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్ వాచ్‌ అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్స్‌తో ఈ స్మార్ట్‌ వాచ్‌ను యూజర్లకు అందించారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి.? పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
పెబుల్ తాజాగా ఇండియాన్‌ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. పెబుల్‌ రివాల్వ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌ ధరను రూ. 3499గా నిర్ణయించారు. ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.39 ఇంచెస్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు.

2 / 5
 ఇక గూగుల్ అసిస్టెంట్, సిరి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాయిస్‌ అసిస్టెంట్ సపోర్ట్‌ను అందించారు. ఈ స్మార్ట్ వాచ్‌ ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తుంది.

3 / 5
అంతేకాకుండా ఈ స్మార్ట్‌ వాచ్‌లో ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్‌ రేట్‌ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్‌ వంటి హెల్త్‌ ట్రాకర్‌ ఫీచర్స్‌ను అందించారు.

4 / 5
ఈ స్మార్ట్ వాచ్‌లో పలు రకాల స్పోర్ట్స్‌ మోడ్స్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చాచరు. దుమ్ము, నీటి రెసిస్టెంట్‌ కోసం ఐపీ67 రేటింగ్‌ను అందించారు.

5 / 5
ఇక ఈ స్మార్ట్ వాచ్‌లో 230 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏడు రోజులు పనిచేస్తుంది. వాట్సాప్‌, ఎస్‌ఎమ్‌ఎస్‌, కాల్స్‌తో పాటు అన్ని రకాల సోషల్‌ మీడియా నోటిఫికేషన్‌లను చూడొచ్చు.