
ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ17 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చారు.

ఒప్పో ఏ17 ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్ రూ. 12,499కి అందుబాటులో ఉంది. ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకుల కార్డులపై రూ. 1500 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తోంది.

ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.56 ఇంచెస్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ335 అక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించారు. ర్యామ్‌ను 8 జీబీ వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు.

స్టోరేజ్ విషయానికొస్తే మెమొరీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు పొడగించుకోవచ్చు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్ ఫ్రంట్‌కెమెరాను అందించారు.

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫ్ 5, బ్లూటూత్ వీ 5.3, జీపీఎస్, యూఎస్‌బీ టైప్‌సీ, 3.5 ఎమ్‌ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌ను అందించారు.