Oneplus: వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.. జీవితకాల డిస్‌ప్లే వారంటీ..

|

Oct 22, 2024 | 2:58 PM

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం వన్‌ప్లస్ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల వన్‌ ప్లస్‌ యూజర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వారెంటీ కాలపరిమితి ముగిసిన వారికి కూడా డిస్‌ప్లే వారంటీ మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ యూజర్లు ఇటీవల ఓ సమస్య ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కొన్ని వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లో గ్రీన్‌లైన్‌ సమస్య వస్తోంది. స్క్రీన్‌పై గ్రీన్‌ లైన్‌ సమస్య చాలా మందికి ఇబ్బందికి గురిచేస్తోంది.

2 / 5
కొన్ని మోడల్స్‌ ఫోన్స్‌లో ఈ సమస్య కనిపిస్తోంది. దీంతో చాలా మంది వన్‌ప్లస్‌ యూజర్లు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. సోషల్‌ మీడియాలో వేదికగా పెద్ద ఎత్తున ఫొటోలను పోస్ట్‌ చేస్తూ వచ్చారు.

3 / 5
అయితే దీనిపై తాజాగా వన్‌ప్లస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్‌ లైన్‌ సమస్య ఉన్న ఫోన్‌కు జీవితకల డిస్‌ప్లే వారటీని అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సమస్య ఎదుర్కొంటున్న యూజర్లు తమకు సమీపంలో ఉన్న సర్వీస్ సెంటర్‌ను సందర్వించాలని కంపెనీ పేర్కొంది.

4 / 5
ఎలాంటి ఛార్జిలు లేకుండా డిస్‌ప్లేను మార్చుకోవచ్చని వన్‌ప్లస్‌ తెలిపింది. వారెంటీ కాలపరిమితి ముగిసిన ఫోన్లకు కూడా ఈ అవకాశం వర్తిస్తుందని వన్‌ప్లస్‌ తెలిపింది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ తర్వాత ఫోన్‌ డిస్‌ప్లే మీద ఆకుపచ్చ రంగులో సన్నటి గీత వచ్చింది.

5 / 5
వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్ల యూజర్లకు ఈ సమస్య ఎదురైంది. దీంతో యూజర్లు సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఫొటోలు పోస్ట్‌ చేశారు. అయితే కేవలం వన్‌ప్లస్‌ మాత్రమే కాకుండా సామ్‌సంగ్, మోటరోలా, వివో బ్రాండ్‌లకు చెందిన కొన్ని ఫోన్‌లలో కూడా ఇలాంటి సమస్యలు ఎదురైనట్లు వార్తలు వచ్చాయి.