Narender Vaitla |
Sep 17, 2023 | 3:46 PM
వన్‌ప్లస్ ప్యాడ్ గో పేరుతో త్వరలోనే కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చేందుకు వన్‌ప్లాస్ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ ట్యాబ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11.6 ఇంచెస్ 2.8 కే ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు.
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌లో ఆడియో కోసం డాల్బీ ఆటమ్స్ సపోర్ట్ స్పీకర్‌లను అందించారు. ఇక ఈ ట్యాబ్‌లో ఐ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేకంగా టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ అందించారు.
ఇక ధర విషయానికొస్తే వన్ ప్లస్ ప్యాడ్‌గో ధరపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం మేరకు ఈ ట్యాబ్ ప్రైస్ రూ. 38,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
వన్ ప్లస్ ప్యాడ్ గో ట్యాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 వరకు ఆపరేటింగ్ సిస్టమ్‌ను పెంచుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ ట్యాబ్లెట్‌లో 12 జీబీ ర్యామ్‌తో పాటు 256 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.