Nothing phone 2a: నిమిషానికి వెయ్యి ఫోన్లు అమ్ముడుపోయాయి.. అంతలా ఏముందనేగా..

|

Mar 15, 2024 | 9:15 PM

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్‌ ఎట్టకేలకు కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నథింగ్‌ ఫోన్‌ 2ఏ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్‌ ధరలో ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ తీసుకొచ్చింది. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. విడుదలైన గంటలోనే భారీ అమ్మకాలను సాధించి రికార్డు నెలకొల్పింది..

1 / 5
లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్‌కు మార్కెట్‌లో ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మోడల్‌ నుంచి ఇది వరకే లాంచ్‌ అయిన ఫోన్‌లు భారీ అమ్మకాలు జరుపుకున్నాయి.

2 / 5
ఇదిలా ఉంటే తాజాగా నథింగ్‌ బ్రాండ్‌ నుంచి మరో ఫోన్‌ను తీసుకొచ్చారు. బడ్జెట్‌ ధరతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తాజాగా మార్కెట్లోకి లాంచ్‌ చేశారు. నథింగ్‌ ఫోన్‌2ఏ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు.

3 / 5
తాజాగా మార్కెట్లోకి లాంచ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ విడుదలైన 60 నిమిషాల్లో ఏకంగా 60,000 యూనిట్ల అమ్మకాలు జరుపుకుకోవడం విశేషం. విపరీతమై డిమాండ్‌ నేపథ్యంల అమ్మకాల పరంగా సరికొత్త మైలురాయిని సాధించిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

4 / 5
 ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ధర విషయానికొస్తే బ్లాక్ అండ్ వైట్ కలర్ వేరియంట్‌లో తీసుకొచ్చి ఈ ఫోన్‌ ప్రారంభ వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ ర్యామ్‌, 256 స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను తీసుకొచ్చారు.

5 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 ప్రో చిప్‌సెట్ ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. ఇందులో 50 ఎంపీ రెయిర్‌ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 45 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.