Nokia C22: రూ. 8 వేలకే నోకియా స్మార్ట్‌ ఫోన్‌.. బడ్జెట్‌ ఫోన్‌ అని తీసిపారేయకండి, ఫీచర్లు తెలిస్తే..

|

May 12, 2023 | 12:46 PM

మొబైల్‌ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నోకియా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నోకియా సీ22 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో అందుబాటులోకి తీసుకొచ్చారు..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నోకియా ఇటీవల మార్కెట్లోకి బడ్జెట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్స్‌ను రిలీజ్‌ చేస్తున్న నోకియా. తాజాగా మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. నోకియా సీ22 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

2 / 5
నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. యూనిసోక్‌ ఎస్‌సీ9863A ప్రాసెసర్‌తో పనిచేస్తే ఈ ఫోన్‌లో 4జీబీ వరకు ర్యామ్, 64జీబీ స్టోరేజ్ సపోర్ట్‌ని అందించారు. రెండేళ్ల పాటు క్వార్టర్లీ సెక్యూరిటీ అప్‌డేట్‌ను అందిస్తారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ కెమెరాను అందించారు. కెమెరాలో పోర్ట్‌రైట్, హెచ్‌డీఆర్, నైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. మూడు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది.

4 / 5
 ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.7,999గా ఉంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీబుక్‌ ప్రారంభమైంది.

5 / 5
ఇక బజాజ్ ఫిన్‌సర్వ్ నుంచి కేవలం రూ.1334 ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. జియో నుంచి రూ.3,500 విలువైన బెనిఫిట్స్ సైతం లభిస్తాయి.