మోటరోలా సంస్థ చేతికి వాచ్‌లా ధరించే స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ దిశగా మోటో ఇప్పటికే ఓ అడుగు ముందుకేసింది. మెటోరోలా మాతృ సంస్థ అయిన లెనోవో టెక్ వరల్డ్ 2023 ఈవెంట్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రదర్శించారు. యూజర్లకు తమకు నచ్చినట్లు ఫోన్‌ను ఫోల్డ్ చేసుకోవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్‌ను అచ్చంగా ఒక స్మార్ట్ వాచ్‌లాగే చేతికి ధరించవచ్చు. ఇందులో ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌లో 6.9 ఇంచె్‌తో కూడిన స్క్రీన్‌ను అందించనున్నారు. అయితే ఫోల్డ్ చేసిన సమయంలో స్క్రీన్ సైజ్ 4.6 ఇంచెస్‌గా మారుతుంది.
ఇక ఈ ఫోన్‌ను యూజర్లు తమకు అనుగుణంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్ను ఎంతలా ఫోల్డ్ చేసినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్క్రీన్‌ను డెవలప్ చేశారు.
ఇక అచ్చంగా స్మార్ట్ వాచ్‌ను తలపించే ఈ ఫోన్‌లో యూజర్లు తమకు నచ్చిన ఫొటోలను, ధరించిన డ్రస్ కలర్స్‌కి అనుగుణంగా వాల్ పేపర్‌ను సెట్ చేసుకోవచ్చు. దీంతో హ్యాండ్ బ్యాండ్ ఫ్యాషన్ వియర్‌గానూ ఉపయోగపడుతుంది.
మోటరోలా తర్వలో ఈ ఫోల్డబుల్ స్క్రీన్‌ను లెనోవో ల్యాప్‌టాప్‌ల్లో కూడా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్స్‌కి సంబంధించి కంపెనీ పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంది.