Moto Razr 40: మోటో ఫోల్డబుల్ ఫోన్‌పై మరోసారి డిస్కౌంట్‌.. బడ్జెట్‌ ధరలోనే..

|

Apr 08, 2024 | 8:13 PM

ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి మోటోరోలా గుడ్ న్యూస్ చెప్పింది. మోటో రేజర్‌ 40పై మరోసారి భారీ డిస్కౌంట్‌ను అందించింది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌పై మోటో అందిస్తోన్న డిస్కౌంట్‌ ఏంటి.? ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
 ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలో గత కొన్ని రోజుల క్రితం మోటో రేజర్‌ 40 పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఈ ఏడాది మొదట్లో ఈ ఫోన్‌పై రూ. 10,000 డిస్కౌంట్ ప్రకటించింది అయితే తాజాగా మరోసారి ఈ ఫోన్‌పై రూ. 5000 డిస్కౌంట్‌ను అందించిందీ కంపెనీ.

2 / 5
మోటో రేజర్‌ లాంచింగ్ సమయంలో ఈ ఫోన్‌ ధర రూ. 59,999గా ఉండేది. అయితే తొలుత కంపెనీ ఇచ్చిన రూ. 10000 డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ. 49,999కి అందుబాటులోకి వచ్చింది. ఇక తాజాగా మరో రూ. 5000 డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కేవలం రూ. 44,999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో తక్కువ బడ్జెట్‌లోనే ఫోల్డబుల్ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం లభించింది.

3 / 5
ఇక మోటో రేజర్‌ 40 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌ను ఫోల్డ్‌ చేసిన తర్వాత బయట స్క్రీన్‌ 1.47 ఇంచెస్‌తో ఉంటుంది. ఇందులో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌ను సగా గ్రీన్‌, సమ్మర్‌ లిలాక్‌, వనిలా క్రీమ్‌ వంటి కలర్స్‌లో తీసుకొచ్చారు.

4 / 5
లోపల స్క్రీన్‌ను 6.9 ఇంచెస్‌తోకూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. అలాగే ఈ ఫోన్‌లో స్క్రీన్ ప్రొటెక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను అందింఆచరు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.