Moto G84 5G: మోటో నుంచి సూపర్ స్మార్ట్‌ ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో 50 ఎంపీ కెమెరా

|

Sep 02, 2023 | 8:48 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా ఇటీవల వరుసగా బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్‌లను తీసుకొస్తోంది. ఇప్పటికే వరుసగా పలు సినిమాలను లాంచ్‌ చేసిన మోటో తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటో జీ84 పేరుతో 5జీ ఫోన్‌ను తీసుకొచ్చారు. శుక్రవారం ఈ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. మోటో జీ84 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్ ఫోన్‌ సెప్టెంబర్ 8 నుంచి అమ్మకానికి అందుబాటులోకి రానుంది.

2 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 19,999గా ఉంది. అయితే కొనుగోలు సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే రూ. వెయ్యి డిస్కౌంట్ పొందొచ్చు.

3 / 5
ఇక మోటో జీ84 స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.55 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ పీఎఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 1300 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఈ డిస్‌ప్లే ప్రత్యేకత.

4 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ ఆక్టాకోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇన్‌ డిస్‌ప్లేను ఇచ్చారు.

5 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 ఎంపీ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. అలాగే బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.