Smart Phone: ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్మార్ట్‌ ఫోన్స్‌ ఇవే.. ఏకంగా రూ. 3 లక్షలు..

|

Nov 30, 2024 | 9:34 PM

ఖరీదైన స్మార్ట్ ఫోన్‌ అనగానే చాలా మందికి ఐఫోన్‌ గుర్తొస్తుంది. ఐఫోన్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ ధర సుమారు రూ. లక్షన్నర వరకు ఉంటుంది. అయితే మనకు తెలిసినంత వరకు ఎక్కువ ఖరీదైన ఫోన్‌ ఇదే అనుకుంటాం. కానీ అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్‌లు కూడా అందుబాటులోకి ఉన్నాయి. ఆ ఫోన్‌లు ఏంటి.? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
హువాయి మేట్ 30 ఆర్‌ఎస్‌ పోర్చే డిజైన్‌ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 2,14,990గా ఉంది. ఈ ఫోన్‌ ఇంకా లాంచ్‌ కాలేదు. ఫీచర్ల విషయానికొసస్తే ఇందులో 2.86 GHz ప్రాసెసర్‌తో కూడిన కిరిన్ 990 ఆక్టా కోర్ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇందులో 6.53 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇచ్చారు.

2 / 5
ఇక హువాయ్‌ మేట్‌ ఎక్స్‌2 స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 2,04,999గా నిర్ణయించారు. ఇందులో 8 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఇక ఇందులో 55 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

3 / 5
ఖరీదైన ఫోన్‌ల జాబితాలో ఉన్న మరో ఫోన్‌లో Lamborghini 88 Tauri. ఈ ఫోన్ ధర రూ.3,60,000గా ఉంది. ఇందులో 5  ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఈ ఫోన్‌ క్వాడ్ కోర్ 2.3 GHz చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించారు.

4 / 5
సామ్‌సంగ్‌ గ్యాలక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 6 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 1,99,990గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్‌తో తీసుకొచ్చారు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8.2 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. 200MP క్వాడ్ కెమెరా ఈ ఫోన్‌ సొంతం.

5 / 5
షావోమీ అంటే బడ్జెట్ ఫోన్‌లకు పెట్టింది పేరు. అయితే ఈ కంపెనీకి చెందిన షావోమీ నుంచి ఓ ప్రీమియం ఫోన్‌ వస్తోంది. షావోమీ నుంచి రెడ్‌మీ కే20 ప్రో సిగ్నేచర్‌ ఎడిషన్‌ ఫోన్‌ను తీసుకొస్తోంది. బంగారం, డైమండ్స్‌తో రూపొందించిన ఈ ఫోన్‌ ధర అక్షరాల రూ. 4,80,000గా ఉంది. ఇందులో 6.39 ఇంచెస్‌ స్క్రీన్‌ను అందిస్తున్నారు. 27 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.