WhatsApp New Feature: మరో కొత్త ఫీచర్‌ తీసుకొస్తున్న వాట్సాప్‌.. ఇకపై మీరు పంపిన డేటాను ఒకేసారి కనిపించేలా చేయొచ్చు.

|

Jul 01, 2021 | 3:07 PM

WhatsApp New Feature: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లలో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే...

1 / 6
 ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్స్‌లలో వాట్సాప్‌ మొదటి వరుసలో ఉంటుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే వాట్సాప్‌కు అంత ఆదరణ ఉంది.

2 / 6
ఆ మధ్య కొత్త ప్రైవసీ విధానం కారణంగా కాస్త కాంట్రవర్సీకి దారి తీసినప్పటికీ తాజాగా మళ్లీ అధునాతన ఫీచర్లతో యూజర్లను చేజారి పోకుండా చూసుకుంటోంది వాట్సాప్‌. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌తో రాబోతోంది వాట్సాప్‌. ఇందులో భాగంగానే 'వ్యూ వన్స్‌' అనే మోడ్‌ను తీసుకురానుంది.

3 / 6
సాధారణంగా మనం ఎవరికైనా మెసేజ్ కానీ, ఫొటోలు కానీ పంపిస్తే అవి అవతలి యూజర్ ఫోన్‌లో స్టోర్‌ అవుతాయి. అంతేకాకుండా చాట్‌ డిలిట్ చేసేంత వరకు అలాగే ఉండిపోతాయి. దీంతో యూజర్‌ మీరు పంపిన ఫొటోలు, వీడియోలను ఎప్పుడుపడితే అప్పుడు చూసుకునే వెసులుబాటు ఉంటుంది.

4 / 6
అలా కాకుండా మీరు పంపిన ఫొటోను అవతలి వ్యక్తి ఒకేసారి చూసుకునేలా చేస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇలాంటి ఆలోచన నుంచే ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది వాట్సాప్‌. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

5 / 6
ఈ కొత్త ఫీచర్‌తో మీరు పంపించే ఫొటోలు, వీడియోలను మీరే కంట్రోల్ చేసే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ను.. అనంతరం ఐవోస్‌ యూజర్లకు అందించనున్నారు.

6 / 6
ఒకవేళ యూజర్ మీరు పంపిన మెసేజ్‌ను స్క్రీన్‌ షాట్‌ను తీసుకుంటే మాత్రం ఏం చేయలేం. అవతలి వ్యక్తి స్క్రీన్‌ షాట్‌ తీసుకుంటే మనకు అలర్ట్‌ వచ్చే విధానం స్నాప్‌ చాట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. మరి వాట్సాప్‌ కూడా ఇలాంటి ఫీచర్‌పై దృష్టి సారిస్తుందో లేదో చూడాలి.