
హానర్ ప్యాడ్ 10.01 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. 80 శాతం స్క్రీన్ టు బాడీ నిష్పత్తితో వచ్చే ఈ ట్యాబ్ అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ట్యాబ్ ప్రస్తుతం 48 శాతం తగ్గింపుతో అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ ట్యాబ్ రూ.10,999కు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

10.61 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే లెనోవో ఎం 10 ట్యాబ్ అమెజాన్‌లో 41 శాతం తగ్గింపు ధరతో ఉంది. 8 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో స్లిమ్ డిజైన్‌తో ఈ ట్యాబ్ యువతను ఆకర్షిస్తుంది. ఈ ట్యాబ్ ధర ప్రస్తుతం రూ.18,999గా ఉంది.

ఎంఐ ప్యాడ్ 6 అమెజాన్తో 31 శాతం తగ్గింపుతో అందుబాటులో ఉంది. 11 అంగుళాల స్క్రీన్‌తో పాటు 13 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆకర్షణీయమైన డిజైన్‌తో వస్తుంది. ఈ ట్యాబ్ ప్రస్తుతం రూ.28,999కు అందుబాటులో ఉంది.

4 జీబీ + 128 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉండే రెడ్ మీ ప్యాడ్ ప్రస్తుతం38 శాతం తగ్గింపుతో వస్తుంది. 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ట్యాబ్ 8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో స్లిమ్ మెటల్ యూనీ బాడీ డిజైన్‌తో వస్తుంది. ఈ ట్యాబ్ ప్రస్తుతం రూ.17,999కు అందుబాటులో ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఏ8 ట్యాబ్ ప్రస్తుతం అమెజాన్‌లో 29 శాతం తగ్గింపుతో వస్తుంది. 10.5 అంగుళాల స్క్రీన్‌తో పాటు 8 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 16 వాట్స్ ఫాస్ట్‌చార్జింగ్‌తో 7040 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ట్యాబ్ ప్రత్యేకత. 4 జీబీ + 64 జీబీ వేరియంట్‌తో వచ్చే ఈ ట్యాబ్ ధర రూ.16,999గా ఉంది.