
హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్ లాంచింగ్ ధర 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999కాగా, 12 జీబీ ర్యామ్, 512 జీబీ వేరియంట్ ధర రూ. 28,999గా లాంచ్ చేశారు. అయితే తాజాగా అమెజాన్‌లో ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 6 వేలు డిస్కౌంట్ లభిస్తోంది.

దీంతో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 22,999 అలాగే.. 12 జీబీ ర్యామ్, 512 జీబీ వేరియంట్ ధర రూ. 24,999కి సొంతం చేసుకోవచ్చు. ఇక ఎస్‌బీఐ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3,370 డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 19,249కే కొనుగోలు చేయొచ్చు.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 1.5కే పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, పీక్ బ్రైట్‌నెస్ 1600 నిట్స్‌గానూ ఉంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై హానర్ 90 5జీ పని చేస్తుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందించారు. ఈ ఫోన్‌లో 66 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.