SIM Card: మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చో తెలుసా? ఒక్క క్లిక్‌తో పూర్తి సమాచారం..

|

Aug 04, 2024 | 5:05 PM

ప్రస్తుతం వస్తున్న అన్ని ఫోన్లు డ్యూయల్ సిమ్ ఆప్షన్లతోనే ఉంటున్నాయి. దీంతో రెండు సిమ్ కార్డులను వాడటం అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే వీటి ద్వారా నేరాలకూ ఆస్కారం ఉండటంతో ప్రతి వ్యక్తి ఎన్ని సిమ్ కార్డులు కలిగి ఉండాలి అనే దానిపై ‘డాట్’ కొన్ని నిబంధనలను విధించింది. ఈ నేపథ్యంలో మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి? మీరు వాడని నంబర్లు, మీకు తెలియని నంబర్లు ఏమైనా ఉన్నాయంటే తెలుసుకోవడం ఎలా? తెలియాలంటే ఇది చదవండి..

1 / 5
ఇంట్లో ఒక నంబర్, ఆఫీసుకు ఒక నంబర్ వినియోగిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఏదో ఆఫర్లోనే లేదా ఫ్రీగానే సిమ్ కార్డులు వస్తుంటాయి. వాటిని మీ ప్రూఫ్ లతోనే తీసుకుంటారు. కానీ వాటి ఆఫర్ అయిపోగానే వాటిని డియాక్టివేట్ చేయకుండా వదిలేస్తారు. దీని వల్ల భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తలెత్తవచ్చు.

2 / 5
మీరు ఉపయోగించని సిమ్ కార్డులు నేరగాళ్లు చేతిలో పడితే సైబర్ నేరాలకు పాల్పడవచ్చు. అలాగే మీకు తెలియకుండా మీ పేరుపై కొత్త సిమ్ కార్డులు తీసుకునే అవకాశం కూడా ఉంది.

3 / 5
వ్యక్తుల ఆధార్ కార్డు ఆధారంగా మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉంది. టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కస్యూమర్ ప్రొటెక్షన్(టీఏఎఫ్-సీఓపీ) అనే ప్లాట్ ఫామ్ సాయంతో ఇది సాధ్యమవుతుంది.

4 / 5
మొబైల్ ఎవరైనా దొంగిలించినా, పోగొట్టుకున్నా దాన్ని బ్లాక్ చేసుకునే అవకాశం కూడా ఈ టీఏఎఫ్-సీఓపీ ప్లాట్ ఫారం అందిస్తుంది. అందుకోసం మీరు మొదటిగా సంచార్ సాతీ వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి.

5 / 5
సంచార్ సాతీ వెబ్ సైట్లో సిటిజెన్ సెంట్రిక్ సిర్వీసెస్ పై క్లిక్ చేసి, దాని కింద కనిపించే నో యువర్ మొబైల్ కనెక్షన్స్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీని తిరిగి ఎంటర్ చేస్తే మీ పేరుతో ఉన్న అన్ని ఫోన్ నంబర్ జాబితా మీకు కనిపిస్తుంది. అందులోని నంబర్లు మీవా? కావా? అనేది చెక్ చేసుకొని మీవి కాకపోతే బ్లాక్ చేసుకోవచ్చు.