ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడిప్పుడే అమ్మకాలు ఊపందుకుంటున్నాయి. దీంతో ఛార్జింగ్ స్టేషన్స్ కోసం వెతుక్కునే పరిస్థితి వచ్చింది. పెట్రోల్ బంకులతో పోల్చితే ప్రస్తుతం ఈవీ స్టేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి.
ఈ సమస్యకు చెక్ పెట్టడానికే గూగుల్ మ్యాప్స్‌లో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్ సహాయంతో ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. గూగుల్ మ్యాప్స్‌లో పెట్రోల్ బంకులను ఎలా చూపిస్తుందో, ఇకపై ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా కనిపిస్తాయి.
ఇందుకోసం మ్యాప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా ఏఐ సహాయంతో యూజర్ రివ్యూలను తీసుకున్న తర్వాత ఈవీ ఛార్జర్ ఉన్న లొకేషన్ మ్యాప్‌లో కనిపిస్తుంది. మీకు దగ్గరల్లో ఉన్న ఈవీ స్టేషన్స్‌కు మ్యాప్‌ను చూపిస్తుంది.
ఈవీ స్టేషన్లకు సంబంధించిన సమాచారంతో పాటు వీటిని ఉపయోగించే యూజర్ల రివ్యూలను కూడా తెలుసుకోవచ్చు. వీటి ఆధారంగా మీకు నచ్చిన ఛార్జింగ్ స్టేషన్‌ను ఎంచుకోవచ్చు.
ఛార్జింగ్ స్టేషన్స్‌లో ఎలాంటి ఫెసిలిటీలు ఉన్నాయి. ఛార్జింగ్‌కు ఎంత సమయం పడుతుంది.? లాంటి వివరాలను రివ్యూ ద్వారా తెలుసుకోవచ్చు. తొలుత అమెరికాలో అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ సేవలను త్వరలోనే భారత్‌లోనూ పరిచయం చేయనున్నారు.