HP chromebook: ట్యాబ్‌ కొనే డబ్బులతో ల్యాప్‌టాప్‌.. రూ. 10 వేలలోనే…

|

Jul 05, 2024 | 9:32 PM

ల్యాప్‌టాప్ కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 30 వేలైనా ఖర్చు చేయాల్సిందే. కొంచెం మంచి ఫీచర్లున్న ల్యాప్‌టాప్‌ అయితే కచ్చితంగా రూ. 40 వేలు పెట్టాల్సిందే. మరి కేవలం రూ. 10 వేలలోనే ల్యాప్‌టాప్‌ లభిస్తే భలే ఉంటుంది. కదూ.! అసాధ్యం అనుకుంటున్నారా.? అయితే ఫ్లిప్‌కార్ట్‌లో మీకోసమే ఒక మంచి ఆఫర్‌ అందుబాటులో ఉంది..

1 / 5
ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌పీ క్రోమ్‌ బుక్‌పై అదిరిపోయే సేల్‌ లభిస్తోంది. హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ 2024పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ క్రోమ్‌బుక్‌ అచ్చంగా ల్యాప్‌టాప్‌లాగే పనిచేస్తుంది. ఈ ల్యాప్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ 2024 అసలు ధర రూ. 34,554 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం 68 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 10,990కే లభిస్తోంది. అయితే దీనిపై మరింత డిస్కౌంట్‌ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే రూ. 1250 డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 10 వేలలోనే సొంతం చేసుకోవచ్చు.

3 / 5
ఇక హెచ్‌పీ క్రోమ్‌బుక్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 11.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ప్లేను అందించారు. 1366x768 పిక్సెల్ రిజల్యూషన్‌, 220 నిట్స్‌ పీక్స్‌ బ్రైట్‌నెస్‌తో ఈ స్క్రీన్ పనిచేస్తుంది. 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను అందించారు.

4 / 5
ఇక ఈ క్రోమ్‌బుక్‌లో క్రోమ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. కాలేజీ, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈ క్రోమ్‌ బుక్‌ బాగా ఉపయోగపడుతుంది.

5 / 5
ఇందులో వెబ్‌ కెమెరా కోసం 720 పీ హెచ్‌డీ కెమెరాను సైతం అందంచారు. ఇక ఈ ల్యాప్‌ టాప్‌ బరువు 1.34 కిలోలుగా ఉంటుంది. డైమెన్షన్స్‌ విషయానికొస్తే 295 x 205.3 x 18.8 mmగా ఉంటుంది. మరి రూ. 10 వేలకు ట్యాబ్‌ కూడా రాని ఈ రోజుల్లో ల్యాప్‌టాప్‌ లభించడం నిజంగానే భలే డీల్‌ కదూ.