గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 75,999కాగా ప్రస్తుతం 18 శాతం డిస్కౌంట్‌తో రూ. 61,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటు యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 8000 డిస్కౌంట్ ఇస్తున్నారు.
ఇక గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 6.2 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించారు. 1,080x2,400 పిక్సెల్ రిజల్యూజన్ ఈ స్క్రీన్ సొంతం.
ఈ ఫోన్ టెన్సర్ జీ3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సామ్‌సంగ్ జీఎన్2 సెన్సర్‌నుంచి అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 10.5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 27 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4575 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే 5జీ, వైఫై ఫీచర్లను అందించారు. రెయిర్ కెమెరాతో 4కే రిజల్యూజన్ వీడియోను రికార్డ్ చేసుకోవచ్చు.
ఇక ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తోపాటు ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లేను అందించారు. సెక్యూరిటీ విషయానికొస్తే ఇందులో అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అందించారు. స్టీరియో స్పీకర్స్‌ను ఇచ్చారు.