Electric Scooter: ఒక్కసారి ఛార్జింగ్‌తో 142 కి.మీ. రేంజ్.. 30కి పైగా ఫీచర్లు.. అద్భుతమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!

Updated on: Aug 17, 2026 | 5:15 PM

Electric Scooter: మార్కెట్లోకి వచ్చిన ఆంపియర్‌ కొత్త స్కూటర్‌ 142 కిలోమీటర్ల ప్రయాణ పరిధిని అందిస్తుంది. ఫీచర్లు అప్‌డేట్ చేసినప్పటికీ, సాంకేతిక పరంగా ఎటువంటి ముఖ్యమైన మార్పులు లేవు. మాగ్నస్ జి మ్యాక్స్‌లో 3 kW LFP బ్యాటరీతో పాటు 2.4 kW హబ్..

1 / 5
 Electric Scooter: ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల హవా కొనసాగుతోంది. మార్కెట్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల జోరు పెరిగిపోతోంది. ప్రస్తుతం అద్భుతమైన మైలేజీ అందించే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లోకి వచ్చిన ఆంపియర్‌ కొత్త స్కూటర్‌ 142 కిలోమీటర్ల ప్రయాణ పరిధిని అందిస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 7.25 గంటల సమయం పడుతుంది. ఈ వాహనం గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు. సున్నా నుండి గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడానికి 6.5 సెకన్లు పడుతుంది.

2 / 5
 ఆంపియర్ కొత్త స్కూటర్‌లో 30కి పైగా ఫీచర్లతో వస్తుంది. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఫైండ్ మై స్కూటర్ సిస్టమ్, OTA అప్‌డేట్‌ల వంటి ఫీచర్లు ఉన్నాయి.

3 / 5
 ఈ వాహనంలో కొత్త ఐదు అంగుళాల డిస్‌ప్లే, విస్తృతమైన కనెక్టెడ్ ఎకో సిస్టమ్, రియల్-టైమ్ ఛార్జింగ్ స్టేటస్, దొంగతనం, టో హెచ్చరికలు, రిమోట్ డయాగ్నోస్టిక్స్, ఛార్జింగ్ హిస్టరీ, బ్యాటరీ హెల్త్ ఇన్‌సైట్స్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.

4 / 5
 ఫీచర్లు అప్‌డేట్ చేసినప్పటికీ, సాంకేతిక పరంగా ఎటువంటి ముఖ్యమైన మార్పులు లేవు. మాగ్నస్ జి మ్యాక్స్‌లో 3 kW LFP బ్యాటరీతో పాటు 2.4 kW హబ్-మౌంటెడ్ మోటార్ అమర్చబడింది. ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ట శక్తి 2.4 kW.

5 / 5
 ఈ వాహనం ధర రూ. 1.10 లక్షలు. కంపెనీ బ్యాటరీకి ఐదు సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. దీనితో పాటు ఈ బ్యాటరీ 2 లక్షల కిలోమీటర్ల మైలేజీని కూడా అందిస్తోంది. ఈ స్కూటర్ బూట్ స్పేస్ 33 లీటర్లు. ఇప్పటికే ఉన్న మాన్‌సూన్ బ్లూ, మ్యాచ్ గ్రీన్ వంటి రంగులతో పాటు, ఈ వాహనం ఇప్పుడు సిన్నమోన్, కాపర్ వంటి కొత్త రంగులలో కూడా లభ్యం కానుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us