
నీటిని వేడి చేసేందుకు చాలా మంది ఇళ్లలో ఎలక్ట్రిక్ కెటిల్స్ ఉపయోగిస్తుంటారు. కానీ దాని శుభ్రత గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ తర్వాత అది అపరిశుభ్రంగా మారిపోతుంది. తర్వాత ఎంత శుభ్రం చేసినా దానిలో ఉన్న మరకలు తొలగిపోవు. ఇలాంటి మరకలను పోగొట్టేందుకు కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

ప్రతిరోజూ నీటిని వేడి చేయడానికి చాలా మంది కెటిల్స్‌ను ఉపయోగిస్తుంటారు. కానీ ఆ కెటిల్‌ని శుభ్రం చేయడంలో పెద్దగా శ్రద్ద చూపము. అయితే, అది మరక కావచ్చు. నీరు క్లోరినేట్ చేసినట్లయితే క్రమం తప్పకుండా కేటిల్ శుభ్రం చేయడం అవసరం.

అయితే కెటిల్ నుండి మరకలను తొలగించడానికి సులభమైన మార్గం ఉంది. మీరు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గృహోపకరణాలను ఉపయోగించి కేటిల్ ఎలా శుభ్రం ఎలా చేయాలో చూద్దాం.

నీటితో కేటిల్ నింపండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయండి. నీటిని మరిగించి ఒక గంట పాటు ఉంచండి. తర్వాత బాగా కడగాలి. మీ కేటిల్ శుభ్రంగా మెరిసిపోతుంది.

వెనిగర్ తో కూడా శుభ్రం చేయవచ్చు. కేటిల్‌లో వెనిగర్‌ను వేయండి. అందులోనీటిని పోయాలి. ఆ తర్వాత నీటిని బాగా మరిగించాలి. కేటిల్ మళ్లీ కడగడం, ఉడకబెట్టడం ద్వారా శుభ్రం సులభంగా శుభ్రమవుతుంది.