WhatsApp: వాట్సాప్‌లో ఏఐ ఫీచర్‌ అక్కర్లేదా.? ఇలా డిసేబుల్ చేసుకోండి..

|

Jul 06, 2024 | 8:23 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం అనివార్యంగా మారిన ప్రస్తుత తరుణంలో దాదాపు అన్ని రంగాల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్‌ సైతం మెటా ఏఐ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు తమకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో పొందే అవకాశం కల్పించారు. అయితే ఈ ఫీచర్‌ నచ్చని వారు ఎలా డిసేబుల్ చేసుకోవాలో తెలుసా.?

1 / 5
 ప్రస్తుతం వాట్సాప్‌లో మెటా ఏఐ ఫీచర్‌ను యాడ్‌ చేసిన విషయం తెలిసిందే. బ్లూ కలర్‌లో రౌండ్ షేప్‌లో ఉన్న ఐకాన్‌పై క్లిక్‌ చేయగానే మెటా ఏఐ చాట్‌బాట్‌ ఓపెన్‌ అవుతుంది. ఇందులో మీకు కావాల్సిన సమాచారాన్ని పొందొచ్చు.

2 / 5
అయితే అందరికీ ఈ ఏఐ ఫీచర్‌ నచ్చాలని ఏం లేదు కదా! మరి ఈ ఫీచర్‌ను మీ యాప్‌ నుంచి డిసేబుల్ చేసుకోలేమా.. అంటే కచ్చితంగా చేసుకోవచ్చు. ఇంతకీ మెటా ఏఐ చాట్‌బాట్‌ను ఎలా ఎనేబుల్‌, డిసేబుల్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
ఇందుకోసం ముందుగా వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం కుడివైపు ఉండే మూడు చుక్కలను సెలక్ట్ చేసుకొని అందులో సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం సెట్టింగ్స్ మెనులో 'చాట్స్'నె ఎంచుకోవాలి. ఆ తర్వాత చాట్‌ సెట్టింగ్‌ మెను ఓపెన్ అయ్యాక 'చాట్ బ్యాకప్'పై క్లిక్ చేయాలి.

4 / 5
ఇప్పుడు మీ వాట్సాప్‌ చాట్స్‌ను ఎందులోకి బ్యాకప్‌ చేయాలనుకుంటున్నారో ఆ గూగుల్ అకౌంట్‌ను ఎంచుకోవాలి. చాట్ బ్యాకప్ పూర్తయిన వెంటనే మీ వాట్సాప్‌ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలి.

5 / 5
ఆ తర్వాత బ్రౌజర్‌లో వాట్సాప్‌ వెర్షన్ 2.24.8.4 పాత వెర్షన్‌ను ఎంచుకొని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం సాధారణంగానే మీ ఫోన్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. దీంతో మెటా ఏఐ ఫీచర్‌ తొలగిపోతుంది. ఒకవేళ మీరు తిరిగి ఏఐ టూల్‌ను పొందాలనుకుంటే మళ్లీ లేటెస్ట్ వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుంది.