Boat smart ring: ఈ ఉంగరం మీ గురించి మొత్తం చెప్పేస్తోంది.. బోట్‌ అద్భుత ఆవిష్కరణ…

|

Jul 22, 2023 | 3:36 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ సంస్థ బోట్ తాజాగా స్మార్ట్‌ రింగ్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్ రింగ్‌ ద్వారా వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల వివరాలను ట్రాక్‌ చేయొచ్చు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఎప్పుడు అందుబాటులోకి రానుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5
భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం బోట్ సరికొత్త ఆవిష్కరణతో వచ్చింది. వియరబుల్‌ గ్యాడ్జెట్స్‌కి పెట్టింది పేరైన ఈ సంస్థ.. తాజాగా వేలికి ధరించే ఒక రింగ్‌ను తీసుకొచ్చింది.

2 / 5
బోట్‌ నుంచి వచ్చిన తొలి స్మార్ట్ రింగ్ ఇదే కావడం విశేషం. ఈ స్మార్ట్ రింగ్‌ను మెటల్‌, సిరామిక్‌ మెటీరియల్‌ను కలిపి డిజైన్‌ చేసింది. చూడ్డానికి సాధారణ రింగ్‌లా కనిపించే ఈ స్మార్ట్‌ రింగ్‌ మీ హెల్త్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది.

3 / 5
శరీర ఉష్ణోగ్రతను రికార్డ్‌ చేస్తుంది. అలాగే రోజువారీ ఫిట్‌నెస్‌ను ట్రాక్‌ చేస్తుంది. ఒక్కరోజులో ఎన్ని కేలరీలు ఖర్చయ్యాయి లాంటి వివరాలను రికార్డ్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ రింగ్‌ను స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకొని డేటా పొందొచ్చు.

4 / 5
అలాగే స్మార్ట్ వాచ్‌లో ఉండే.. హార్ట్ రేట్ సెన్సార్, ఎస్‌పీఓ2 సెన్సార్‌, స్లీప్‌ ట్రాకర్‌, మహిళల కోసం ప్రత్యేకంగా పీరియడ్‌ ట్రాకర్‌ వంటి ఫీచర్లు సైతం ఉంటాయి.

5 / 5
అలాగే ఈ స్మార్ట్‌ రింగ్‌కు టచ్‌ కంట్రోలింగ్‌ను కూడా ఇవ్వనున్నారు. వాటర్‌ రెసిస్టెంట్‌ కోసం 5ATM రేటింగ్‌ను ఇచ్చారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ స్మార్ట్ రింగ్‌ ధరకు సంబంధఙంచి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.