
కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్ క్లాస్‌లు, వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ పెరగడంతో ల్యాప్‌టాప్‌ల వినియోగం బాగా పెరిగింది. దీంతో కొత్తగా ల్యాప్‌టాప్ కొంటున్న వారు సంఖ్య కూడా పెరుగుతోంది. మరి రూ. 30 వేల లోపు ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఏంటో తెలుసుకుందామా..

Lenovo 82C6000KIH: ఈ ల్యాప్‌టాప్‌లో 14 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. దీంతో పాటు AMD Ryzen 3 3250U గ్రాఫిక్స్ ఈ ల్యాప్‌టాప్ సొంతం. 4జీబీ ర్యామ్ 1 టీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 26,999గా ఉంది.

Avita PURA 9220e : రూ. 30 వేల లోపు ఉన్న బెస్ట్ లాప్‌టాప్స్‌లో ఇదీ ఒకటి. ఇందులో 14 అంగుళాల హెచ్‌డీ టీఎఫ్‌టీ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. అంతేకాకుండా ఏఎమ్‌డీ ఈపీయూ డ్యూయల్ కోర్ ఏ6 ప్రాసెసర్‌ను అందించారు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ల్యాప్‌టాప్‌లో 8 జీబీ ర్యామ్ అందించారు. ఇక ధర విషయానికొస్తే రూ. 24,990గా ఉంది.

Lenovo Ideapad D330 10IGM: ఈ ల్యాప్‌టాప్‌లో 1280×800 రిజల్యూషన్‌తో కూడిన 10 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌ను అందించారు. ల్యాప్‌టాప్ ధర విషయానికొస్తే రూ. 25,990కి అందుబాటులో ఉంది.

Dell Inspiron 15 3000: తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ల్యాప్‌టాప్‌లలో డెల్ కంపెనీకి చెందిన ఈ ల్యాప్‌టాప్ ఒకటి. ఇందులో 15.6 అంగుళాల యాంటీ గ్లేర్ ఎల్‌ఈడీ హెచ్‌డీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇందులో AMD Athlon Gold 3150U ప్రాసెసర్‌ను ఇచ్చారు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ల్యాప్‌టాప్ రూ. 27,990గా ఉంది.