Redmi 13C: నెవర్ బిఫోర్‌ ఆఫర్‌.. రూ. 16వేల స్మార్ట్ ఫోన్‌ను రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు..

|

May 16, 2024 | 9:59 AM

సమ్మర్‌ సేల్‌ ముగిసిన తర్వాత కూడా అమెజాన్‌ ఆఫర్లను కొనసాగిస్తోంది. ముఖ్యంగా పలు స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రెడ్‌మీ 13సీపై ఏకంగా 31 శాతం తగ్గింపు ధర ఇస్తోంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
రెడ్‌మీ13 సీ 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,999కాగా 31 శాతం డిస్కౌంట్‌తో రూ. 10,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అంతేకాకుండా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 డిస్కౌంట్‌ పొందొచ్చు.

2 / 5
దీంతో రూ. 16 వేల స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 10 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 1600×720 పిక్సెల్ రిజొల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఇచ్చారు. దీంతో స్క్రీన్‌ను అదనపు ప్రొటెక్షన్ లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఓఎస్ వర్షన్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన సెన్సర్‌ మాక్రో కెమెరాను అందించారు. డెప్త్‌ సెన్సర్‌ కెమెరాను ఇచ్చారు.

5 / 5
సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. అలాగే బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 18 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ కెసాపిటీ గల బ్యాటరీని అందించారు.