
Amazfit GTS 4 Mini Smart Watch: ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 7,999గా ఉంది. ఈ వాచ్‌లో 120కిపైగా స్పోర్ట్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. 24 గంటల హార్ట్ రేట్ మానిటరింగ్ ఈ వాచ్ సొంతం. ఇక ఈ వాచ్‌లో 1.65 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 5ఏటీఎమ్ వాటర్ రెసిస్టెన్సతో స్విమ్‌ప్రూఫ్ అందించారు.

ColorFit Pro 5: ఇక తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మరో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లో కలర్‌ఫిట్ ప్రో 5 ఒకటి. ఈ స్మార్ట్ వాచ్‌లో 1.96 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఇందులో హార్ట్‌రేట్, ఎస్‌పీఓ2 వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. ఈ వాచ్ ధరను రూ. 5,499గా నిర్ణయించారు.

Fossil Gen 6 Smartwatch: రూ. 10 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్‌లలో ఫాజిల్ కంపెనీకి చెందిన ఈ వాచ్ ఒకటి. ఈ వాచ్ ధర రూ. 9,598గా ఉంది. ఇందులో జీపీఎస్ ట్రాకర్, ఎస్‌ఓ2 వంటి హెల్త్ ఫీచర్లను అందించారు. 45 వాట్స్ బ్యాటరీతో రూపొందించిన ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 గంటలు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది.

Samsung Galaxy Watch4 Bluetooth: సామంగ్ వాచ్ ధర రూ. 9,999గా ఉంది. ఇందులో ఎన్నో హెల్త్ ట్రాకింగ్ పీచర్లను అందించారు. హార్టరేట్ సెన్సార్, బీపీ సెన్సార్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లను ఇందులో అందించారు. ఈ వాచ్ 90కిపైగా వర్క్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

Titan Crest Premium Mesh Strap Smartwatch: రూ. 10 వేలలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్ లలో ఇదీ ఒకటి. ఈ వాచ్ ధర రూ. 7,994గా ఉంది. ఇందులో 1.43 ఇంచెస్‌తో కూడిన స్టాండింగ్ స్క్రీన్ డిస్‌ప్లేను అందింఆచరు. అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ వాచ్ సొంతం. ఈ వాచ్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 5 రోజుల పాటు పనిచేస్తుంది. 100కి పైగా వాచ్ ఫేస్‌లు ఇందులో ఇచ్చారు.