
మనకి చదువు అంటే ఏంటో తెలియని రోజు నుంచి మనకి చదువు గురించి మొత్తం అర్ధమయ్యే వరకు మన చెయ్యి పట్టుకుని ఉండేది ఒకే ఒక్కరు ఆయనే గురువు. మన జ్ఞానాన్ని పంచుతూ, మనల్ని మంచి మనిషిగా మార్చి ఎదగడానికి మార్గం చూపించే గురువులందరికీ హృదయపూర్వక నమస్కారం టీచర్స్ డే శుభాకాంక్షలు!

కేవలం చదువు మాత్రమే చెప్పేసి చేతులు దులుపుకోకుండా జీవితంలో ఎలా అడుగులు వెయ్యాలి? కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎలా గెలవాలో నేర్పిన ప్రతి గురువుకూ టీచర్స్ డే శుభాకాంక్షలు. పిల్లల కలలకు రెక్కలు తొడిగి, వాళ్ళు గెలవడానికి దారి చూపిన గురువులకు వందనాలు.

పిల్లలు చేసే తప్పులను సరిదిద్ది, వారి ప్రతి అడుగులో ప్రోత్సహించిన గురువులకు ధన్యవాదాలు. చదువే కాకుండా.. జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు ఎలా మనల్ని సరిదిద్దుకోవాలో నేర్పించేది గురువులే. మీ సపోర్ట్ మేము చేసే పనిలో ఉండాలని కోరుకుంటూ ప్రతి గురువుకూ టీచర్స్ డే శుభాకాంక్షలు

అక్షరాలతో సరిపెట్టుకోకుండా.. జీవితంలో ఎలా ముందుకు సాగాలో, ఓటమి ముందు ఎలా నిలబడాలో నేర్పించి , విజయాన్ని ఎలా అందుకోవాలో నేర్పిన గురువులందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రతి ఉపాధ్యాయుడికి టీచర్స్ డే శుభాకాంక్షలు.

తల్లి దండ్రుల తరవాత గురువుకు అంత స్థానం దొరికిందంటే పిల్లలతో ఆ బంధం అంత విలువైనది. విద్యార్థి జీవితాన్నే మార్చే శక్తి గురువులకు మాత్రమే ఉంది. పిల్లల విజయాల వెనుక కనిపించని శక్తిగా ఉండే ప్రతి గురువుకూ టీచర్స్ డే శుభాకాంక్షలు. తొలి అడుగులు నేర్పిన గురువులను ఎప్పటికీ మర్చిపోకూడదు.