నోరూరించే చిలగడదుంపల పూరీ.. నూనె అస్సలు పీల్చకుండా, పువ్వుకంటే మెత్తగా.. తిన్నారంటే వేళ్ళు కొరికేసుకుంటారు..

Updated on: Mar 24, 2026 | 6:22 PM

చిలగడదుంపలను ఉడకబెట్టడం కంటే ఆవిరిపై (Steaming) ఉడికించడం వల్ల వాటిలోని పోషకాలు పోవు, పిండి కలిపేటప్పుడు పూరీలు మెత్తగా వస్తాయి. ఇందులో ఫైబర్, విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు లంచ్ బాక్స్‌లో ఇచ్చేందుకు లేదా పండగ సమయాల్లో స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్‌గా ఇది అద్భుతంగా ఉంటుంది. పిండిని సరైన పద్ధతిలో కలిపితే పూరీలు అస్సలు నూనె పీల్చుకోకుండా, బంతిలా పొంగుతూ వస్తాయి. తక్కువ శ్రమతో ఇంట్లోనే హెల్తీ స్వీట్ పూరీలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
సాధారణంగా పూరీలంటే కేవలం మైదా పిండి లేదంటే గోధుమపిండితో చేస్తాం. కానీ, ఈసారి ఆరోగ్యంతో పాటు రుచిని ఇచ్చే చిలగడదుంప పూరీలను ప్రయత్నించండి. ప్రముఖ కుకరీ ఇన్ఫ్లుయెన్సర్ పూనమ్ దేవ్నానీ ఈ ప్రత్యేకమైన రెసిపీని పంచుకున్నారు. చిలగడదుంప పూరీ (Shakarkand Ki Puri) రెసిపీకి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. నూనె పీల్చుకోకుండా, మెత్తగా, బెలూన్‌లా పొంగే పూరీలను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

2 / 5
ఈ రెసిపీలో ఉన్న సీక్రెట్ ట్రిక్ ఏంటి?: చాలామంది చిలగడదుంపలను నేరుగా నీళ్లలో ఉడకబెడతారు. దీనివల్ల అవి ఎక్కువ నీటిని పీల్చుకుంటాయి. ఫలితంగా పూరీ పిండి పలచగా అయి, వేయించేటప్పుడు ఎక్కువ నూనెను పీల్చుకుంటాయి. కానీ, చిలగడదుంపలను ఆవిరిపై (Steam) ఉడికించడం వల్ల పిండి గట్టిగా, పర్ఫెక్ట్‌గా వస్తుంది.

3 / 5
ఇక ఈ పూరీల తయారీకి కావాల్సిన పదార్థాలు..చిలగడదుంపలు - 2 పెద్దవి (ఆవిరిపై ఉడికించినవి), గోధుమ పిండి - 2 కప్పులు, బొంబాయి రవ్వ (సుజీ) - 2 టేబుల్ స్పూన్లు (పూరీ క్రిస్పీగా రావడం కోసం), యాలకుల పొడి - అర టీస్పూన్, పంచదార పొడి లేదా బెల్లం తురుము - 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి - 1 టీస్పూన్ (పిండి కలపడానికి), నూనె - వేయించడానికి సరిపడా తీసుకోవాలి.

4 / 5
తయారీ విధానం: ఆవిరిపై ఉడికించిన చిలగడదుంపల పొట్టు తీసి, ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేయాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి, రవ్వ, యాలకుల పొడి, పంచదార పొడి, స్మాష్ చేసిన చిలగడదుంప మిశ్రమాన్ని వేయాలి. మొదట చిలగడదుంపలోని తేమతోనే పిండిని కలపడానికి ప్రయత్నించండి. అవసరమైతేనే ఒకటి లేదా రెండు స్పూన్ల నీరు చల్లుకోండి. పిండిని గట్టిగా (పూరీ పిండిలా) కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి. మరుగుతున్న నూనెలో వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

5 / 5
ఆరోగ్య ప్రయోజనాలు: చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపుకు మరియు రోగనిరోధక శక్తికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణ పూరీల కంటే ఇవి ఎక్కువ సేపు మెత్తగా ఉంటాయి, కాబట్టి ప్రయాణాలకు కూడా ఇవి ఉత్తమమైన ఎంపిక.

Follow Us