పుచ్చకాయతో ఇలా రైస్ చేసి తింటే.. ఎండాకాలంలో వచ్చే ఆ సమస్యలన్ని తరిమికొడుతుంది

Updated on: Apr 09, 2026 | 1:07 PM

Watermelon rice recipe in telugu: పుచ్చకాయతో ఇలా రైస్ చేసి తింటే శరీరాన్ని చల్ల బరుస్తుంది. ఇంకా ఈ సమయంలో వచ్చే కొన్ని రకాల అనారోగ్య సమస్యలన్ని తరిమికొడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినండి. రుచి అదిరిపోతోంది.

1 / 5
కావాల్సిన పదార్దాలు :  రెండు కప్పుల రైస్,  ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు, కట్ చేసిన ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి,  ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్,  కరివేపాకులు, అర టేబుల్ స్పూన్  జీలకర్ర,  అర టేబుల్ స్పూన్ ఆవాలు, నాలుగు ఎండు మిర్చి, రుచికి సరిపడా ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, కొత్తిమీరను తీసుకోవాలి.

2 / 5
పుచ్చకాయ రైస్ ఎలా తయారు చేయాలంటే? ఇది వెజిటేబుల్ రుచిని ఇస్తుంది. ముందుగా మనం అన్నం ఎలా వండుకుని తింటామో అలాగే అన్నాన్ని వండి  చల్లార్చుకోవాలి. ఇలా చేస్తే ఈ రైస్ మంచి రుచిని ఇస్తుంది.

3 / 5
ముందుగా వీటిని పోపు పెట్టుకోవాలి: గ్యాస్ వెలిగించి పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, అది వేడయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి.

4 / 5
వీటిని నూనెలో బాగా వేయించుకోవాలి: ఆ తర్వాత  నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు ఆకులు , నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం పేస్ట్ వేసి  బాగా వేయించాలి . ఉల్లిపాయ ముక్కలు వేసి  గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి.

5 / 5
ఇప్పుడు పుచ్చకాయ ముక్కలు కూడా దానిలో వేసికుని ఒక 5 నిమిషాల పాటు పొయ్యి మీద ఉంచి బాగా కలుపుకోవాలి.  తరువాత వండిన అన్నం వేసి ఉప్పు కలిపి బాగా మిక్స్ చేయాలి. చివరగా నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

Follow Us