
పల్లెటూరి స్టైల్ రాగి అంబలి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: అర కప్పు రాగి పిండి , మూడు కప్పుల నీరు, రెండు కప్పుల మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు , ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం, మూడు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిను తీసుకోవాలి.

పల్లెటూరి స్టైల్ రాగి అంబలి తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా రాగి పిండిని తీసుకుని దానిలో అర కప్పు నీళ్ళు పోసి దీనిని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకో పాత్ర తీసుకుని నీటిని తీసుకుని బాగా మరిగించుకోవాలి. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి

పల్లెటూరి స్టైల్ రాగి అంబలి తయారీ విధానం స్టెప్ 1 : ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత దీనిలో రాగి పిండిని పోస్తూ దీనిని ఒక గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇంకా మీడియం మంటపై 15 నిమిషాల పాటు బాగా ఉడికించి కొంచం చిక్కగా అయ్యేవరకు దీనిని అలాగే ఉంచాలి. ఇది పూర్తిగా చల్లగా అయినా తర్వాత మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి.

పల్లెటూరి స్టైల్ రాగి అంబలి తయారీ విధానం స్టెప్ 2 : ఇక ఇప్పుడు దీనిలో కుట్ర చేసిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర పొడిని వేసి దీనిని కలుపుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా నీరు కూడా వేసి మీకు ఎలా నచ్చితే అలా తీసుకోవచ్చు.

పల్లెటూరి స్టైల్ రాగి అంబలి తయారీ విధానం స్టెప్ 3 : ఈ రాగి అంబలిని తీసుకుని 15 నిమిషాలు పాటు పక్కన పెడితే వీటిలో వేసిన ప్లేవర్స్ చక్కగా మిక్స్ అవుతాయి. దీనిని మీరు కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు. మంచి రుచిగా ఉంటుంది. ఇంకా దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేస్తె వీటికి మంచి టేస్ట్ వస్తుంది.