
శ్రీశైలంలో వైభవంగా దసరా మహోత్సవాలు నాలుగో రోజు కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన భ్రమరాంబికా కైలాస వాహనంపై పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం ఘనం జరుగుతున్నాయి.

నంద్యాల జిల్లా శ్రీశైల మహా క్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి నాలుగవ రోజు భ్రమరాంబికా దేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కుష్మాండదుర్గ అలంకారంలో ఉన్న అమ్మవారికి పలురకాలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు.

శ్రీ భ్రమరాంబికా దేవి చంద్ర ఘంట అలంకారంలో అలానే మల్లికార్జునస్వామి, అమ్మవారును కైలాస వాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవ మూర్తుల ముందు నాదస్వరం, కేరళ చండీ మేళం, కొమ్ము కోయ నృత్యం, కోలాటం, రాజభటుల వేషాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఆలయం లోపలి నుంచి భాజా భజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మ వార్ల గ్రామోత్సవంగా నిర్వహించగా, గ్రామోత్సవంలో కదలివస్తున్న స్వామి, అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు