
శ్రావణ మాసంలో గోధుమ రవ్వతో కేసరిని ప్రసాదంగా చేసి, అమ్మవారికి సమర్పించడం వలన ఆ దేవత సంతోషిస్తుందంట. అంతే కాకుండా ఈ ప్రసాదం లక్ష్మీదేవికి ప్రీతికరం అంటున్నారు. అందుకే శ్రావణ మాసంలో శుక్రవారం లేదా సోమవారం గోధుమ రవ్వ కేసరి చేసి నైవేద్యంగా పెట్టడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. కాగా, దీనిని ఎలా తయారు చేయాలి అంటే?

గోధుమ రవ్వతో కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : ఎరుపు రంగులో ఉండే గోధుమ రవ్వ, ఒక కప్పు చక్కెర, ఒక కప్పు బెల్లం, పటిక, నెయ్యి, కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్, నీరు, వీలైతే పాలు కప్పు, ఎండు ఖర్జూర, జీడిపప్పు.

తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. తర్వాత అందులో గోధుమ రవ్వను వేసి మంచిగా , దోరగా వేయించుకోవాలి. ఇది ఎంత బాగా వేయిస్తే, రవ్వ కేసరి అంత అద్భుతంగా ఉంటుంది.

రవ్వ పర్ఫెక్ట్‌గా వేగి తర్వాత దీనిని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. ఇదే పాన్‌లో వన్ టీ స్పూన్ నెయ్యి వేసి, జీడిపప్పు, ఎండు ఖర్జూర, కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ స్టవ్‌పై పెట్టాలి. అందులో కొలతల ప్రకారం నీళ్లు పోయాలి. నీరు పొంగులా వచ్చే వరకు వేడి చేయాలి.

అది పొంగులా వస్తున్న సమయంలో అందులో వేయించి పెట్టుకున్న రవ్వను వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత అది 70 శాతానికి పైగా ఉడుకుతుంది. అప్పుడు అందులో చక్కెర, బెల్లం వేసి మంచిగా కలుపుకోవాలి. దాదాపు పదినిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. మంచిగా కలిసి మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత అందులో కుంకుమ పువ్వు, పటిక,ఇలాచీ పౌడర్, టీ స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత దీనిని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రవ్వకేసరి రెడీ.