‘పింక్ రికార్డ్స్’ : ధోనీ రికార్డుకు విరాట్ కోహ్లీ బ్రేక్.. మోతేరా స్టేడియంలో మోత మోగించిన అశ్విన్‌, అక్షర్

|

Mar 04, 2021 | 8:39 AM

India vs England: టీమిండియా, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మూడో టెస్టులో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. సొంతగడ్డపై అత్యుత్తమ సారథిగా విరాట్‌ కోహ్లీ.. మరోవైపు స్పిన్నర్‌ అశ్విన్‌ 400 వికెట్ల పడగొట్టి రికార్డుల్లోకి ఎక్కగా.. అక్షర్‌ పటేల్‌ ఆడుతున్న రెండో టెస్టులోనే 10 వికెట్లను పడగొట్టి అద్భుతం చేశాడు.

1 / 5
టీమిండియా సారథిగా ఇప్పటికే విరాట్‌ కోహ్లీ రికార్డుల్లోకి ఎక్కాడు. 35 విజయాలు అందుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్‌పై విజయంతో ఎంఎస్‌ ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు. గతంలో సొంతగడ్డపై అత్యధిక విజయాల రికార్డు మహీ పేరుతో ఉండేది.

2 / 5
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 400 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌, మూడో స్పిన్నర్‌గా మారాడు. అంతేకాకుండా ముత్తయ్య మురళీధరన్‌ తర్వాత ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 400 వికెట్ల మైలురాయి చేరుకొందీ అశ్వినే ఒక్కడే.

3 / 5
గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అక్షర్‌ పటేల్‌ అతడి స్థానాన్ని అంచనాలను మించి అదరహో అనిపిస్తున్నాడు. అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్ల రికార్డు సాధించిన అతడు మొతేరాలో 10+ వికెట్ల ఘనత సొంతం చేసుకున్నాడు.

4 / 5
డే అండ్ నైట్‌ టెస్టులో స్పిన్నర్లు అత్యధిక వికెట్లు తీసిందీ అహ్మదాబాద్‌ టెస్టులోనే. ఇంగ్లాండ్‌, భారత్‌ స్పిన్నర్లు మొత్తంగా 27 వికెట్లు పడగొట్టారు.

5 / 5
టీమిండియాపై ఇంగ్లాండ్‌ చేసిన అత్యల్ప స్కోరు 81 పరుగులు. మొతేరా రెండో ఇన్నింగ్స్‌లో నమోదైంది. 1971లో ఓవల్‌లో 101, 1979/80లో ముంబైలో 102, 1986లో లీడ్స్‌లో 102, 2020/21లో అహ్మదాబాద్‌లో 112 మిగిలిన నాలుగు సందర్భాలు.