
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్ గురించి షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఆర్సబీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మళ్ళీ ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆడకపోవచ్చుని కోహ్లీ అన్నాడు.

ఐపీఎల్ ప్రారంభానికి వారం రోజులు మిగిలి ఉండగానే ఆర్సీబీ చేరిన విరాట్ కోహ్లీ, ఒక ఫ్రాంచైజీ కార్యక్రమానికి హాజరయ్యాడు. నిజానికి, ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు వందలకు పైగా పరుగులు చేసిన విరాట్, గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో కేవలం ఒక సెంచరీ మాత్రమే సాధించాడు. తర్వాత పెద్దగా రాణించలేదు.

ఈ పర్యటన అంతటా, కోహ్లీ ఆఫ్ స్టంప్ బయటికి వెళ్ళే బంతులను ఆడటానికి ప్రయత్నించి పదే పదే అవుట్ అయ్యాడు. ఇది అభిమానులను మాత్రమే కాకుండా నిపుణులను కూడా ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ కార్యక్రమంలో కోహ్లీ దాని గురించి ఎదురైన ప్రశ్నకు సందిస్తూ..

"నేను మళ్ళీ ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడకపోవచ్చు, కాబట్టి గతంలో ఏమి జరిగినా, నేను దానితో సంతృప్తి చెందాను" అని అన్నాడు. దీని అర్థం కోహ్లీ మళ్ళీ ఆస్ట్రేలియా పర్యటనలో ఆడే అవకాశం లేదని చెప్పకచెప్పాడు. 2027 చివరిలో ఆస్ట్రేలియాలో ఇండియాలో పర్యటించనుంది. అంటే అంతకంటే ముందే కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.

కోహ్లీ ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే 2027 చివరి నాటికి కోహ్లీ క్రికెట్ నుంచి రిటైర్ కావచ్చని చర్చ జరుగుతోంది. అయితే, కోహ్లీ మరోసారి టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వగలడని అభిమానులు ఆశిస్తున్నారు. రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో అతని బ్యాట్ నుండి పరుగుల వర్షం కురుస్తుందని కూడా వారు ఆశిస్తున్నారు.