Ravi Kiran |
Apr 24, 2021 | 8:23 AM
ఐపీఎల్ 2021 రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విజృంభించాడు. అద్భుతమైన అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనితో ఇప్పటిదాకా లీగ్‌లో ఎవరూ చేయని ఘనతను సాధించగలిగాడు.
రాజస్థాన్ రాయల్స్‌పై అజేయంగా అర్ధ సెంచరీ సాధించడం ద్వారా కోహ్లీ ఐపీఎల్‌లో 6000 పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత అందుకున్న మొదటి బ్యాట్స్ మెన్ కోహ్లీ కావడం విశేషం.
ఐపీఎల్ లో కోహ్లీ 196 మ్యాచ్‌ల్లో 38.35 సగటుతో 6021 పరుగులు చేశాడు. 130.69 స్ట్రైక్ రేట్ సాధించాడు. ఇందులో ఐదు సెంచరీలు, 40 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
విరాట్ కోహ్లీ ఇప్పుడు టీ20లో 10 వేల పరుగులకు చేరువలో ఉన్నాడు. 308 టీ20 మ్యాచ్‌ల్లో కోహ్లీ 9,874 పరుగులు చేశాడు.