1 / 5
చాలా మంది క్రికెటర్లు తమ జీవిత భాగస్వామిని మరొక వృత్తికి చెందినవారిని ఎన్నుకొంటుంటారు. అయితే ఒక క్రికెటర్ మరొక క్రికెట్‌ను వివాహం చేసుకోవడం చాలా తక్కువగా జరుగుతుంది. ఇలాంటివారు వేళ్లపై లెక్కించేంత మంది మాత్రమే ఉంటారు. అలాంటివారిలో ఒకరు ఆస్ట్రేలియా తుఫాను బౌలర్ మిచెల్ స్టార్క్ జంట. స్టార్క్ పురుషుల జట్టులో ఒక ముఖ్యమైన సభ్యుడు.. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకడు, అతని భార్య అలిస్సా హిల్లి కూడా ఆస్ట్రేలియా మహిళా జట్టులో ముఖ్యమైన సభ్యురాలు. అయితే ఈ ఇద్దరి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంది.