Weekly Horoscope: ఈ వారం ఆ రాశులకు పట్టిందల్లా బంగారమే! వారికి ఉద్యోగాల్లో శుభవార్తలు

Edited By:

Updated on: Aug 08, 2026 | 5:49 PM

వార ఫలాలు (ఆగస్టు 9-15, 2026): మేష రాశి వారికి ఈ వారమంతా చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ఆర్థిక విషయాలకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈ వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): వారమంతా చాలావరకు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. రాశ్యధిపతి కుజుడు తృతీయ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఆర్థిక విషయాలకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. గురు, రాహువుల బలం కూడా అధి కంగా ఉన్నందువల్ల  ముఖ్యమైన ప్రయత్నాలు, ఆలోచనలు కలిసి వస్తాయి. ఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్ర త్తగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం, ఆర్థిక విషయాల్లో ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం శ్రేయస్కరం.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నందువల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారంభించినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వారమంతా సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. రాశ్యధిపతి బుధుడు, గురు గ్రహాల సంచారంతో పాటు, శుక్ర, రవులు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా, సంతృప్తికరంగా సాగు తుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. మిత్రుల వివాదాల్లోమధ్య వర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): గురు బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా, హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగంలో సహచరుల నుంచి సహకారం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. క్షణం కూడా తీరిక లేకుండా గడిచిపోతుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్న ప్పటికీ ముఖ్యమైన వ్యవహారాల్ని, కొన్ని పెండింగ్ర పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి నుంచి వృత్తి, ఉద్యోగాల విషయంలో శుభ వార్తలు వింటారు. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ధన స్థానంలో శుక్రుడు, లాభ స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా ఏ ప్రయత్నం తలపె ట్టినా సఫలమవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. రాశ్యధిపతి రవి వ్యయ స్థానంలో సంచారం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు ప్రయా ణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. అష్టమ శని వల్ల ఇంటా బయటా కొద్దిగా పని ఒత్తిడి తప్పకపోవచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కొద్దిగా ఆశాభంగం చెందే సూచనలున్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థికపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): లాభ స్థానంలో రాశ్యధిపతి బుధుడు, గురువు కలిసి ఉన్నందువల్ల అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరి స్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరి ష్కారం అవుతాయి. తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితం పొందుతారు. అత్యవసర పనులు తేలికగా పూర్తవుతాయి. ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించడంలో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. పిల్లల చదువులకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. దూరపు బంధువుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఈ వారమంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. గురు, శనుల బలంతో పాటు రవి, బుధులు కూడా అనుకూలంగా సంచారం చేస్తు న్నందు వల్ల కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా మారు తాయి. సర్వత్రా మీ మాట చెల్లుబాటవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. కొన్ని అత్యవసర వ్యవహారాలను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): గురు, శనుల బలం బాగా అనుకూలంగా ఉండడంతో పాటు లాభస్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. బంధుమిత్రులు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శుభవార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయ వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వ్యాపారాలకు ఇబ్బందేమీ ఉండదు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు వీలై నంత దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

9 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): గ్రహ బలం  కొంత వరకు అనుకూలంగా ఉంది. శుభ గ్రహమైన శుక్రుడు దశమ స్థానంలో, రాహువు తృతీయ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి. బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది. ఎటువంటి సమస్య నైనా పరిష్కరించుకోగలుగుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఒకరిద్దరు స్నేహితులతో సమస్యలు తలెత్తుతాయి. బాగా సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ వారమంతా మిశ్రమంగా గడిచిపోతుంది. సప్తమ స్థానంలో రవి, బుధ, గురువులు, తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడి సంచారం కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.  ఆదాయానికి మించి ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా మాత్రమే పెరిగే అవకాశం ఉంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. కుటుంబ జీవితంలో అనుకోకుండా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభ కార్యంలో ఇష్ట మైన బంధువుల్ని కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు.

11 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): పంచమ స్థానంలో కుజుడు, షష్టంలో గురు, బుధ, రవుల సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో ఆశిం చిన స్థాయిలో రాబడి పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆదా యానికి లోటుండదు. ఉద్యోగంలో సానుకూల పరిస్థితులుంటాయి. అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ధన స్థానంలో శని, సప్తమ స్థానంలో కేతువు సంచారం వల్ల అప్పుడప్పుడూ కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహా రాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో, భాగ్యాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన రాబడి చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు కానీ, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిపాటి ప్రయత్నంతో ఉద్యోగంలో అధికారులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు బాగా పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహా రాలను తేలికగా పూర్తి చేస్తారు. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మంచి ఆఫర్లు అందివస్తాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us