Weekly Horoscope: హమ్మయ్య.. వారికి ఆర్థిక కష్టాలు తీరిపోతాయ్..12 రాశులకు వారఫలాలు

Edited By:

Updated on: Jun 20, 2026 | 5:36 PM

వార ఫలాలు (జూన్ 21-27, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు ఈ వారం ఆశించిన శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి రంగంలో మార్పులు జరుగుతాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు, వ్యవ హారాల్లో తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. తోబుట్టువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇంటా బయటా పనిభారం పెరుగుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలుంటాయి. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితి, దాంపత్య జీవితం చాలావరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది.

2 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా, లాభసాటిగా పురోగమిస్తాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గం అనుసరిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. తలపెట్టిన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల ద్వారా ఆశించిన శుభవార్త అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రయాణాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో పెద్దల వల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. పిల్లల విషయంలో ఆశించిన శుభ సమాచారం అందుకుంటారు.

3 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థికంగా అనుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఇంటా బయటా పని భారం పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణ యాలు తీసుకోవడం మంచిది. ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు సాగిస్తే అదనపు ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మంచి ఫలితాలనిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

4 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా, ఆశాజనకంగా సాగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం చాలావరకు అనుకూలంగా పురోగమిస్తుంది. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపార సమస్యలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. తోబుట్టువులతో మాట పట్టింపులు తలెత్తుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలపడతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ప్రయాణాల్లోనూ, ఆహార, విహారాల్లోనూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

5 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగంలో పని ఒత్తిడి, పని భారం నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు కనిపిస్తాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అందుతాయి. ఇంట్లో శుభ కార్యాలకు ప్లాన్ చేస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు స్నేహితులతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. కుటుంబ సభ్యుల వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండడం వల్ల విశ్రాంతి కరువవుతుంది. దైవ కార్యాలలో పాల్గొంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

6 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): వృత్తి, ఉద్యోగాల్లో బరువు, బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే అవకాశం ఉంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారానికి కొత్తగా పెట్టుబడులు ముందుకు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ముఖ్య మైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. దగ్గర బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు తగిన ఆఫర్ అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.

7 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వృత్తి, ఉద్యోగాలు బాగా ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా పురోగమిస్తాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో కొత్త వ్యూహాలు, కొత్త నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. లాభాలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా, ఉల్లా సంగా గడిపే అవకాశం ఉంది. వృత్తికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడతారు. ఆర్థికంగా సమయం అనుకూలంగా ఉంది. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకునే పక్షంలో ఇరకాటంలో పడే అవకాశం ఉంది. బంధువుల వల్ల కుటుంబంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

8 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సంతృప్తికరంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎక్కడా ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పెద్దలతో సంప్రదించి ముందుకు వెళ్లడం మంచిది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్తి వివాదాన్ని పరిష్కరించుకోవడంలో అనుకోని ఆటంకాలుంటాయి. ఆహార, విహారాల్లో కాస్తంత  జాగ్రత్తగా ఉండడం మంచిది. షేర్లు బాగా లాభిస్తాయి.

9 / 12
ధనుస్సు (మూల,  పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది. పెట్టుబడులు పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. మిత్రుల సహకారంతో కొన్ని ముఖ్య మైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలన్నీ చక్కబడే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.

10 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బలం పుంజుకుంటాయి. ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పకుండా కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ప్రయాణాలు, ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చాలావరకు సానుకూల పడతాయి. కుటుంబ జీవితం సామరస్యంగా, అన్యోన్యంగా సాగిపోతుంది. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఆదాయానికి లోటుండదు.

11 / 12
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడి బరువు బాధ్యతలు పెంచుతారు. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగావకాశాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఆకస్మిక లాభానికి అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. విలాసాల మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

12 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): వృత్తి, ఉద్యోగాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. సహోద్యోగులతో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది.  వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్ధి, జీతభత్యాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభ కార్యాల మీద, కుటుంబం మీద ఖర్చులు పెరగ వచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగి పోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సజావుగా పురోగమిస్తాయి.

Follow Us