
భక్తి పాటలు ఎన్నో ఉన్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే మదిలో నిలిచిపోతుంటాయి. అయితే ఇప్పటి వాటితో పొలిస్తే గతంలో కొన్ని సినిమాల్లో వచ్చిన భక్తి పాటలు ఆ తరం వారినే కాకుండా ఈ తరం వారికి కూడా ఫేవరెట్ అయిపోతుంటాయి. అందులో ముఖ్యంగా శివుడికి సంబంధించిన ఈ పాట మాత్రం అందరికీ ఫేవరెట్ ఇంతకీ ఈ పాటా ఏది అనుకుంటున్నారా?

శ్రీ మంజునాథ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా 2001లో థియేటర్లో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. తెలుగు కన్నడ భాషలలో నిర్మించి రీలిజైన ఈ ఆధ్యాత్మిక చిత్రం మంచి హిట్ అందుకుంది. ఈ మూవీని కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల లోని శ్రీ మంజునాథేశ్వరుని కథతో దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు రూపొందించాడు.

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పార్వతిగా, మీనా, మంజు నాథుడిగా అర్జున్, సౌందర్య హీరోయిన్‌గా, సుమలత, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అంబరీష్ ఇలా చాలా మంది ఫేమస్ యాక్టర్స్ నటించారు. అయితే ఈ సినిమాలోని ప్రతి పాట చాలా అద్భుతంగా ఉంటాయి.

ముఖ్యంగా ఈ మూవీలో ఓం మహా ప్రాణ దీపం శివం, శివం, ఓం అనాహత నాదం శివం శివం , ఓం మహా ప్రాణ దీపం శివం, శివం, ఓం అనాహత దీపం శివం శివం అనే పాట చాలా అద్భుతంగా ఉండడమే కాకుండా, పాజిటివ్ వైబ్‌ను ఇస్తుంది. అయితే ఈ పాట ఇప్పటికీ ప్రతి శివాలయంలో వినిపిస్తుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండ్ అవుతుంది.

సంవత్సరాలు గడిచినా ఈ పాటకు ఉన్న క్రేజ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. చాలా మంది తమ స్టేటస్‌లో ఇప్పటికీ ఈ పాటను మొగిస్తూనే ఉంటున్నారు. దీంతో ఈ సాంగ్ నెట్టింట ట్రెండింగ్ భక్తి సాంగ్‌గా వైరల్ అవుతుంది. ఇక హంసలేఖ సంగీతం అందించిన ఈ పాటను శంకర్ మహదేవన్ పాడారు, వేద వ్యాస సాహిత్యం అందించారు.