Raja Yoga: జీవితంలో ఓ మెట్టు పైకి..! ఆ రాశుల వారికి మహారాజ యోగం..!

Edited By:

Updated on: Apr 25, 2026 | 1:32 PM

ప్రస్తుతం గ్రహస్థితుల ప్రభావంతో మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి విపరీత రాజయోగం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావంతో జీవితంలో వేగంగా ఎదుగుదల, సామాజిక హోదా పెరుగుదలకు అవకాశముంది. అలాగే ఆకస్మిక శుభ అవకాశాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.

1 / 8
జ్యోతిష శాస్త్రం ప్రకారం 6, 8, 12 స్థానాల అధిపతులు ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా, ఎవరి స్థానాల్లో వారున్నా విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఉదాహరణకు, 6వ స్థానాధిపతి 6,8,12 స్థానాల్లో ఉండటం అన్నమాట. అదే విధంగా 8వ స్థానాధిపతి 6,8,12 స్థానాల్లోనూ, 12వ స్థానాధిపతి 6,8,12 స్థానాల్లోనూ ఉన్నప్పుడు ఈ విపరీత రాజయోగం ఏర్పడుతుంది. విపరీత రాజ యోగమంటే అతి త్వరగా జీవితంలో అందలాలు ఎక్కడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, సామాజిక హోదా పెరగడం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కావడం వంటివి. ప్రస్తుతం మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశుల వారికి ఈ యోగం పట్టింది.

2 / 8
మేషం: ఈ రాశికి అష్టమ స్థానాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో మే 12 వరకు సంచారం చేస్తున్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల ఈ రాశివారు తప్పకుండా అధికారం చేపడ తారు. ఒక సంస్థను నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. ప్రజా ప్రతినిధిగా గౌరవాలందుకుంటారు. చిన్న వయసులోనే గృహ, వాహన సౌకర్యాలు అమరడం, ఏదో ఒక నైపుణ్యంలో గుర్తింపు పొందడం జరుగుతాయి. విదేశాల్లో చదువులు, వృత్తి, ఉద్యోగాల వంటివి చోటు చేసుకుంటాయి.

3 / 8
మిథునం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలోనే సంచారం చేస్తున్నందువల్ల విప రీత రాజయోగం ఏర్పడింది. దీనివల్ల వీరు తమ రంగంలో ప్రఖ్యాతి చెందుతారు. ఊహించని గుర్తింపు లభిస్తుంది. ఒక మేధావిగా, ప్రముఖుడిగా చెలామణీ అవుతారు. రవాణా, క్రీడలు, కమ్యూనికేషన్ రంగాల్లో నిష్ణాతులవుతారు. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఎటు వంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారమవుతుంది.

4 / 8
కర్కాటకం: ఈ రాశికి షష్టాధిపతి అయిన గురువు 12వ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల మరో రెండు నెలల లోపల వీరు తప్పకుండా రాజకీయ ప్రముఖులు గానీ, ప్రజా ప్రతి నిధులుగానీ అయ్యే అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఆస్తి కలసి వచ్చి ఐశ్వర్యవంతులు కావడం జరుగుతుంది. అత్యంత ప్రముఖులుగా గుర్తింపు పొందుతారు. రాజ పూజ్యాలు కలుగుతాయి. మంత్రులు, ఎంపీలకు సలహాదార్లుగా వ్యవహరించడం జరుగుతుంది.

5 / 8
సింహం: ఈ రాశికి షష్టాధిపతి అయిన శని అష్టమంలో సంచారం చేయడం వల్ల ఈ ఏడాదంతా విపరీత రాజయోగం కలిగింది. ఈ రాశివారు నిజంగానే ఒక సింహంలా జీవించడం జరుగుతుంది. అతి తక్కువ కాలంలో రాజకీయ, వ్యాపార, వృత్తి రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. చదువులు, ఉద్యోగాల్లో సాటి లేని మేటి అనిపించుకుంటారు. అత్యంత ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ తాయి. రియల్ ఎస్టేట్, లిక్కర్ రంగాల్లో వీరికి తిరుగుండదు. సమస్యలు లేని జీవితం అనుభవిస్తారు.

6 / 8
తుల: ఈ రాశికి అష్టమాధిపతి అయిన అష్టమంలోనే సంచారం చేయడం వల్ల ఈ యోగం కలిగింది. దీనివల్ల మరో 15 రోజుల పాటు వృత్తి, వ్యాపారాల్లో ఎదురుండదు. ఒక పెద్ద వాణిజ్య సంస్థకు అధిపతి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. ఉద్యోగం ఇవ్వగలిగిన స్థితిలో ఉంటారు. తరచూ ఆర్థికంగా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. ఉద్యోగాల్లో అందరికంటే ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

7 / 8
ధనుస్సు: ఈ రాశికి షష్టాధిపతి అయిన శుక్రుడు షష్ట స్థానంలోనే సంచారం చేయడం వల్ల ఈ యోగం కలిగింది. దీనివల్ల తక్కువ సమయంలోనే విదేశాలలో స్థిరపడడం, ఉద్యోగాల్లో సొంత ముద్ర వేయడం వంటివి తప్పకుండా జరుగుతాయి. అనారోగ్యాలకు అవకాశం ఉండదు. వ్యాపార,వాణిజ్య సంస్థల్ని నిర్వహించడం జరుగుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందుతాయి.

8 / 8
మకరం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన గురువు షష్ట స్థానంలో సంచారం చేయడం వల్ల రెండు నెలల పాటు విపరీత రాజయోగం కలిగింది. ఈ యోగం ఏర్పడినప్పుడు వృత్తి, వ్యాపారాల్లో చక్రం తిప్ప డం జరుగుతుంది. సామాజిక సేవా సంస్థను లేదా ట్రస్టును నిర్వహించే అవకాశం ఉంది. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. దర్జాగా, ధీమాగా జీవితం సాగిస్తారు. మేధావిగా, సలహాదారుగా గుర్తింపు పొందుతారు. అసాధారణ ప్రజ్ఞావంతులవుతారు. ప్రముఖులతో సమానం అవుతారు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us