
మేష రాశి: మేష రాశి వారు బంగారం ధరిస్తే ఎలాంటి కష్టాలు దరిచేరవు. ఇంకా వీరు మొదలు పెట్టిన పనులు కూడా పూర్తి చేస్తారు. ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుంది. లీడర్ గా ఉండి అనేక మంచి పనులు చేస్తారు. వీరు బంగారం ఉంగరం ఎడమ చేతికి పెట్టుకుంటే మంచిది.

వృషభ రాశి : వృషభ రాశివారికి ఈ అక్షయ తృతీయ రోజున నుంచి శతక యోగం నుంచి బాగా కలిసొస్తుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బు వస్తుంది. ఇంకా అధిక లాభాలు వస్తాయి. మీ కుటుంబ జీవితం కూడా మారుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది.

కర్కాటకం: రాశ్యధిపతి చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం, లాభాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలోనే చంద్రుడితో యుతి చెందడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల లాభాల పంట పండుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మనసులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.

కన్య: ఈ రాశికి ధన, లాభాధిపతులైన శుక్ర, చంద్రులు భాగ్య స్థానంలో కలవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. పిత్రార్జితం లభిస్తుంది.

వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడు, ఉచ్ఛ చంద్రుడు యుతి చెందడం వల్ల ఉద్యోగపరంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులతో పాటు జీతభత్యాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో దశ తిరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సినిమా, టీవీ కళాకారులకు జనాకర్షణ బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం తప్పకుండా జరుగుతుంది.

మకరం: ఈ రాశికి పంచమ, సప్తమాధిపతులైన శుక్ర, చంద్రులు పంచమంలో కలవడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటపడతాయి. ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి.