Luxury Life: శుక్రుడి కటాక్షం.. ఇక ఈ రాశుల వారికి విలాసవంతమైన జీవితం..!

Edited By:

Updated on: Apr 21, 2026 | 6:48 PM

Shukra Gochar 2026: గ్రహ సంచారంలో శుక్రుడికి బలం కలిగితే కొన్ని రాశుల వారి జీవితాలు విలాసవంతంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం, విలాస జీవితం అనుభవించడం, సుఖ సంతోషాలతో గడిపేయడం వారికి ప్రధాన ధ్యేయం అయిపోతుంది. విలాస జీవితానికి కారకుడైన శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలోకి ఈ నెల (ఏప్రిల్) 20న ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశుల వారు విలాసాల విషయంలో కొత్త పుంతలు తొక్కుతారు. ఆధునిక సౌకర్యాలు, విలాస వస్తువుల మీద బాగా ఖర్చు చేస్తారు. మే 14న శుక్రుడు వృషభ రాశిని వదిలిపెట్టే వరకూ మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చిక రాశులకు ఇక ఆకాశమే హద్దుగా విలాస జీవితం సాగిపోతుంది.

1 / 6
మేషం: ఈ రాశివారికి విలాసవంతమైన జీవితం మీదా, ఉన్నత స్థాయి జీవనశైలి మీదా, సంపన్న వర్గా లతో కలిసి తిరగడం మీదా మోజు ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరగడం, ప్రముఖులతో పరిచయాలు పెరగడం వంటి కారణాల వల్ల ఈ రాశివారు వీలైనంతగా విలాస జీవితం గడిపే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రులతో విహార యాత్రలు చేయడం జరుగుతుంది. ఫ్యాషన్ల మీదా, అలంకార వస్తువుల మీదా ఖర్చు బాగా పెరుగుతుంది. (Photos: TV9 Telugu)

2 / 6
వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి విలాసాలు, వ్యసనాల మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. విలాస జీవితానికి, సుఖ సంతోషాలతో గడప డానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. స్వక్షేత్రంలో శుక్రుడి సంచారం వల్ల వీరిలో జనాకర్షణ పెరుగుతుంది. ఉన్నత స్థాయి జీవనశైలి కోసం ప్రయత్నిస్తారు. తరచూ ఖరీదైన వస్తువులను కొనడం జరుగుతుంది. సౌందర్య సాధనాల మీద మోజు పెరుగుతుంది. భోగ భాగ్యాలను అనుభవిస్తారు.

3 / 6
కర్కాటకం: ఈ రాశికి చతుర్థ (సుఖాలు), లాభాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో సంచారం  చేయడం వల్ల విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి. సుఖ సంతోషాలకు బాగా ప్రాధాన్యం ఇస్తారు. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు కూడా అవకాశం ఉంది. రకరకాలుగా విలాస జీవితాన్ని అనుభవించడంలో ముందుంటారు. తమలోని నైపుణ్యాల్ని, తెలివితేటల్ని గరిష్ఠంగా ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకుంటారు. వీరి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది.

4 / 6
కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శుక్రుడి ప్రవేశం వల్ల ఈ రాశివారి జీవన శైలి చాలావరకు మారిపోతుంది. వీరి జీవితంలో ఆడంబరాలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఏ మాత్రం అవకాశం లభించినా సౌందర్య సాధనాల మీదా, అలంకరణల మీదా, విలువైన వస్త్రాభరణాలు కొనడం మీదా ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. మిత్రులతో ఎంజాయ్ చేయడానికి, సంపన్నులతో తిరగడానికి, విలాసంగా గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు. విహార యాత్రలకు ఎక్కువగా అవకాశం ఉంది.

5 / 6
తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి విలాస జీవితం మీద, ఉన్నత స్థాయి జీవనశైలి మీద మక్కువ పెరుగుతుంది. విలాసాల మీద డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తారు. ఖరీదైన వస్తువులను, వస్త్రాభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ రాశివారికి భోగభాగ్యాల మీద ఆసక్తి వృద్ధి చెందుతుంది. సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడం మీద శ్రద్ధ పెడతారు. ఆదాయాన్ని బాగా పెంచుకుంటారు.  ఉన్నత స్థాయి జీవితం గడుపుతారు.

6 / 6
వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి సుఖసంతోషాలతో జీవితం గడపడం మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో విలాసాల్లో మునిగి తేలుతారు. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి జీవితం గడపడం మీద  మోజు ఎక్కువగా ఉంటుంది. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అభిరుచుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us