
వృషభం: ఈ రాశిలోనూ, ఆ తర్వాత ద్వితీయ స్థానంలోనూ సంచారం చేయబోతున్న రాశ్యదిపతి శుక్రుడి వల్ల నెల రోజుల పాటు జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా పురోగమిస్తుంది. కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. గృహ, వాహన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశిలో ప్రవేశించబోతున్న శుక్రుడి వల్ల మరో నెల రోజుల పాటు ఈ రాశివారికి జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంతా సాగిపోతుంది. సుఖ సంతోషాలకు లోటుండదు. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. హోదా పెరిగే సూచనలున్నాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించి, మానసిక ప్రశాంతత కలుగుతుంది.

కన్య: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో శుక్ర సంచారంవల్ల ఈ రాశివారికి నెల రోజుల పాటు విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. తప్పకుండా ఆస్తి లాభం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా సమసిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది.

తుల: రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలోనూ, ఆ తర్వాత భాగ్య స్థానంలోనూ సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.

మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు పంచమ, షష్ట స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహన యోగం కలుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.

కుంభం: ఈ రాశికి చతుర్ధ, పంచమ స్థానాల్లో శుక్ర సంచారం వల్ల జూన్ 8 వరకు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది కొద్ది ప్రయత్నంతో ఆస్తిపాస్తులు సమకూరుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలకు, శుభకార్యాలకు లోటుండదు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.