Moon Transit: చంద్రుడి అనుగ్రహం.. వీరికి ధన యోగాలు, రాజయోగాలు పక్కా..!

Edited By:

Updated on: Oct 08, 2026 | 6:11 PM

ఈ నెల(అక్టోబర్) 10 నుంచి అంటే అమావాస్య తర్వాత నుంచి 20వ తేదీ వరకు సుమారు పది రోజుల పాటు చంద్రుడు తనకు బాగా అనుకూలమైన స్థానాల్లో సంచారం చేయడం జరుగుతోంది. తులా రాశి నుంచి ప్రారంభమైన చంద్రుడి సంచారం 20న మకర రాశి వరకు గురు, శుక్ర, కుజ గ్రహాలతో సాగుతుంది. వీటివల్ల ధన యోగాలు, రాజయోగాలు ఏర్పడతాయి. మనస్సుకు, ఆరోగ్యానికి కారకుడైన చంద్రుడికి ఈ విధంగా బలం పెరిగినప్పుడు తప్పకుండా మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ప్రయత్నాలు చేపట్టినా తప్పకుండా నెరవేరుతాయి. చంద్రుడి వల్ల లబ్ధి పొందేది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, తుల, మకర రాశులు.

1 / 6
మేషం: ఈ రాశివారికి ఈ పది రోజుల చంద్ర సంచారం అన్ని విధాలుగానూ అదృష్టం కలిగించబోతోంది. ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా సత్ఫలితాలనిస్తుంది. ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం వృద్ది చెందుతాయి. ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కలు గుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. తల్లి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో పైకి వస్తారు. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి.

2 / 6
వృషభం: ఐశ్వర్య కారకుడైన చంద్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం అనేక మార్గాల్లో బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలమవుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్ని కొత్త పుంతలు తొక్కించడానికి ఇది బాగా అనుకూల సమయం.

3 / 6
మిథునం: ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది.కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి.ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని దాదాపు పూర్తిగా పరిష్కరించుకుంటారు.  ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఊరట లభించే అవకాశంఉంది.

4 / 6
కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడికి ఈ పది రోజుల కాలంలో గురువుతో సంబంధం పెరుగుతున్నందువల్ల  ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి ఇది అన్ని విధాలుగానూ అను కూల సమయం. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో స్థితిగ తులు పెరుగుతాయి. పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.

5 / 6
తుల: ఈ రాశికి దశమాధిపతి అయిన చంద్రుడు బాగా అనుకూలంగా మారుతున్నందువల్ల వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, అధికార యోగం పట్టడం వంటివి జరుగుతాయి. నిరు ద్యోగు లకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

6 / 6
మకరం: చంద్రుడి అనుకూల సంచారం వల్ల ఈ రాశివారికి ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. మీ సలహాలు, సూచనలకు  విలువ ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పురోగతి చెందడంతో పాటు శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

Loading...
Unable to load recommendations.
Follow Us