Astrology: మన టైమ్ వచ్చేసింది భయ్యా.. వారు అనుకున్నది సాధిస్తారు..!

Edited By:

Updated on: Aug 06, 2026 | 6:45 PM

ప్రస్తుతం గ్రహస్థితులు అనుకూలంగా ఉండటంతో వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి వచ్చే నాలుగు నెలలు శుభప్రదంగా ఉండే అవకాశముంది. గురు, శని, రాహువు అనుకూల ప్రభావంతో వీరు కెరీర్, ఆర్థికం, వ్యక్తిగత జీవితంలో పురోగతి సాధిస్తారు. ఎన్నో రోజులుగా ఉన్న కోరికలు, లక్ష్యాలను సాకారం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

1 / 7
గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని రాశులకు పట్టపగ్గాలుండవు. గురు, శని, రాహువుల వంటి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉంటే అదృష్టాలు వెంటబడతాయి. ప్రస్తుతం వృషభం, కర్కా టకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి మరో నాలుగు నెలల పాటు గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. వీరు కలలను పట్టుదలగా సాకారం చేసుకుంటారు. తిరుగులేని ప్రయ త్నాలు సాగిస్తారు. వీరిలోని పట్టుదల, ఓపిక, సహనాల వల్ల తప్పకుండా ప్రతిదీ సాధించుకుం టారు. వీరు తమ కోరికలు, ఆశలు, ఆశయాలను నెరవేర్చుకోవడం తప్పకుండా జరుగుతుంది.

2 / 7
వృషభం: ఈ రాశికి శుక్రుడు అధిపతి అయినందువల్ల ఈ రాశివారిలో భౌతికమైన ఆశలు, కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి కావలసిన పట్టుదల, ఓర్పు, సహనాలు కూడా వీరికి ఎక్కువే. సంపన్నులు కావాలనే ఆకాంక్ష వీరిలో ఎక్కువగా ఉంటుంది. గురు, రాహు, శనుల బలంతో పాటు రాశ్యధిపతి శుక్రుడి బలం కూడా తోడవడం వల్ల వీరు పట్టువదలని విక్రమార్కు డిలా ప్రయత్నాలు సాగించి తమ కలల్ని సాకారం చేసుకుంటారు. తప్పకుండా సంపన్నులవుతారు.

3 / 7
కర్కాటకం: ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం ఇతరుల కంటే ఒక పాలు ఎక్కువగా ఉంటుంది. రాశ్యధిపతి చంద్రు డికి గురు బలం తోడవడం వల్ల పట్టుదల, తెగువ వంటివి బాగా పెరుగుతాయి. వీరు దృష్టి పెట్టా రంటే అది నెరవేరే వరకూ నిద్రపోరు. వీరిలో ఆర్థిక బలం, కుటుంబ సౌఖ్యం మీద మోజు ఎక్కువగా ఉంటుంది. గురు, శని, రవి, కుజ గ్రహాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు సంపద పెంచుకోవడంతో పాటు, మనసులోని కోరికలను చాలావరకు నెరవేర్చుకునే అవకాశం ఉంది.

4 / 7
తుల: ఈ రాశివారికి వ్యాపార దృష్టి ఎక్కువ. కనిపించని మొండితనం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. రాశ్యధిపతి శుక్రుడు క్రమంగా అనుకూలంగా మారడంతో పాటు, శని, గురు, రాహువులు బాగా బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఆస్తిపాస్తులు, గృహ, వాహనాలు సమకూర్చుకోవాలన్న వీరి మనసులోని కోరిక తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. పెద్దల నుంచి, మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది.

5 / 7
వృశ్చికం: ఈ రాశివారిలో భౌతికమైన ఆశలు, ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. కలలు కనడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని పట్టుదలగా సాధించుకోవడం వీరికి అలవాటు. రాశినాథుడైన కుజుడితో పాటు శని, గురువుల బలం కూడా పెరుగుతున్నందువల్ల వీరు ప్రతిదీ సాధించుకుంటారు. కొద్ది ప్రయత్నంతో వీరి కలలు సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధితో పాటు, సంపన్న స్థితికి వెళ్లడం, ఉన్నత పదవుల్ని అందుకోవడం మీద దృష్టి పెట్టి చివరికి వాటిని సాధించుకుంటారు.

6 / 7
మకరం: దూరదృష్టికి, పట్టుదలకు, సాహసానికి, సహనానికి మారుపేరైన ఈ రాశివారికి ఏ రంగంలో ఉన్నా ఉన్నత పదవుల మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. సరైన గుర్తింపు కోసం తాపత్రయపడతారు. ఇతరులకు భిన్నమైన ఆలోచనలు చేస్తుంటారు. పాలన, ప్రజా సంబంధాలు, సేవా రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నది వీరి కోరిక. రాశినాథుఢు శని ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉన్నందువల్ల వీరు దూరదృష్టితో వ్యవహరించి తమ ఆశయాలు, కలలను నెరవేర్చుకుంటారు.

7 / 7
మీనం: ఈ రాశివారికి మనసులో కోరికలు కలగడమే తక్కువ. కోరిక కలిగితే మాత్రం అది నెరవేరనిదే, సాకారం కానిదే నిద్రపోరు. వీరిలో పట్టుదల ఎక్కువ. ఎంతటి శ్రమకైనా ఓర్చుకుంటారు. తమ కల లను, కోరికలను, ఆశలను నెరవేర్చుకోవడానికి వీరు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. రాజకీయ ప్రాబల్యం, ధన సంపాదన మీద కోరిక ఉంటుంది. రాశ్యధిపతి గురువు పంచమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నందువల్ల రాజకీయాల్లోనూ, ఆదాయంలోనూ ముందడుగు వేసే అవకాశంఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us