
వృషభ రాశి: ఈ రాశికి లాభాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో, బుదుడు పంచమ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉండడం వల్ల ఈ రాశివారికి షేర్లు, స్టాకులు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి మీద అత్యధికంగా శ్రద్ద చూపించే ఈ రాశివారు షేర్లను ఎంపిక చేయడంలో నిపుణులవుతారు. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మరింతగా షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టి లబ్ధి పొందడం జరుగుతుంది.

మిథున రాశి: రాశ్యధిపతి బుధుడు చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం, గురువు ధన స్థానంలో సంచారం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభాలు ఎక్కువగా కలుగుతాయి. ముఖ్యంగాషేర్లు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 26 తర్వాత బుధుడు తులా రాశిలో ప్రవేశిస్తున్నందువల్ల షేర్లు, స్పెక్యు లేషన్లు మరింతగా లాభిస్తాయి. రాశ్యధిపతి బుధుడు వ్యాపార నైపుణ్యాలు కలిగిన వాడైనందువల్ల వీరు షేర్లను ఎంపిక చేయడంలో ముందుంటారు. షేర్లు అంచనాలకు మించి బాగా లాభిస్తాయి.

కన్యా రాశి: ఈ రాశిలో రాశ్యధిపతి, వ్యాపార కారకుడైన బుధుడు సంచారం చేస్తుండడం, ఈ నెల 26 నుంచి ధన స్థానంలో ప్రవేశించడం, గురువు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలోఉండడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా షేర్ల వ్యాపారం కలిసి వస్తుంది. లాటరీలో గెలిచే అవకాశం కూడా ఉంది. ఇతరత్రా ఎటువంటి అదనపు ఆదాయ మార్గాలు చేపట్టినా బాగా కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు కూడా లాభాలనిస్తాయి. అతి కొద్ది మొత్తంతో అధిక లాభాలు పొందడం జరుగుతుంది.

తులా రాశి: సహజసిద్ధంగా వ్యాపార నిపుణులైన ఈ రాశివారు తప్పకుండా షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబ డులు పెట్టి లబ్ది పొందే అవకాశం ఉంది. గురు, బుధులు ఈ రాశికి ప్రస్తుతంబాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు షేర్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల ద్వారా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారమవుతుంది. అదనపు ఆదాయానికి చేపట్టే ప్రతి ప్రయత్నమూ విజయ వంతం అవుతుంది. ఆస్తిపాస్తుల వల్ల, అద్దెల వల్ల వీరికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి: సహజంగా ఈ రాశివారు ఆర్థికాభివృద్ధి విషయంలో ఎటువంటి అవకాశాన్నీ జారవిడుచుకునే అవ కాశం ఉండదు. రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, బుధుడు దశమ, లాభ స్థానాల్లో సంచారం చేస్తుండడం వల్ల షేర్లతో సహా అనేక కొత్త ఆదాయ అవకాశాలను ఆర్థికాభివృద్దికి ఉప యోగించుకునే అవకాశం ఉంది. వీరికి షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు తప్పకుండా లాభించే అవకాశం ఉంది. షేర్లలో అతి కొద్ది పెట్టుబడితో వీరు అత్యధికంగా సంపాదించడం జరుగుతుంది.

మకర రాశి: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో బుధుడు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తుండడం, రాశ్యధిపతి శని భాగ్య స్థానాన్ని వీక్షిస్తుండడం వల్ల ఈ రాశివారు ఎక్కువగా అదనపు ఆదాయ మార్గాల్ని చేపట్టే అవకాశం ఉంది. వీరికి షేర్ల వ్యాపారం బాగా లాభిస్తుంది. షేర్లు, స్పెక్యు లేషన్ల మీద అతి తక్కువగా పెట్టుబడులు పెట్టినా అత్యధికంగా లాభాలు పొందుతారు. వడ్డీ వ్యాపా రాల్లో కూడా తిరుగులేని లాభాలు గడిస్తారు. అదనపు ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది.