Telugu Astrology: ఇక ఈ రాశులకు పట్టిందల్లా బంగారం! అంచనాలకు మించిన పురోగతి..

Edited By: Janardhan Veluru

Updated on: Oct 04, 2025 | 7:18 PM

జాతక చక్రంలోనూ, గ్రహ సంచారంలోనూ తృతీయ స్థానానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. తృతీయ స్థానం ప్రయత్నానికి, చొరవకు, తెగింపునకు, పట్టుదలకు, పురోగతికి సంబంధించిన స్థానం. ఈ స్థానం బలంగా లేని జాతకుడు జీవితంలో అభివృద్ధి చెందడం జరగదు. ఎన్ని యోగాలున్నా ఫలించే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం మేషం, మిథునం, కర్కాటకం, సింహం, ధనుస్సు, మకర రాశులకు తృతీయ స్థానం ముఖ్యమైన గ్రహాలతో బాగా బలంగా ఉన్నందువల్ల వీరు ఏ విషయంలోనైనా అంచనాలకు మించి పురోగతి చెందే అవకాశం ఉంది. ఈ రాశుల వారు మరో నెల రోజుల పాటు తమ మనసులోని కోరికలు సాకారం కావడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది.

1 / 6
మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో గురువు  సంచారం వల్ల ఈ రాశివారు ఆదాయాన్ని వృద్ధి చేసుకోవడానికి, విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడానికి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ఈ రాశివారికి మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో వీరి అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి. విదేశీ ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన ఆఫర్లు అందడం జరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి.

2 / 6
మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర, కేతువుల సంచారం వల్ల ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయ వృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేపట్టినా ఫలిస్తుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సొంత ఇంటి ప్రయత్నాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది. కొందరు ముఖ్యమైన బంధువులతో ఉన్న వివాదాలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి.

3 / 6
కర్కాటకం: తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల ఈ రాశివారికి అనేక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది. ముఖ్యంగా ఆదాయం పెరగడానికి అందివచ్చే మార్గాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. రాజీమార్గంలోనైనా ఆస్తి వివాదాలను, కోర్టు కేసులను పరిష్కరించుకోవడం ఉత్తమం. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టే పెట్టుబడులు బాగా లాభిస్తాయి. సొంత ఇంటి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు.

4 / 6
సింహం: ఈ రాశికి తృతీయ స్థానంలో బుధ, కుజుల సంచారం ఎంతో యోగదాయకం. కొద్ది ప్రయత్నంతో అత్యధికంగా లాభాలు పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి వీలైనంతగా కృషి చేయడం మంచిది. బంధుమిత్రుల నుంచి రావలసిన బాకీలను రాబట్టు కుంటారు. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా సాకారం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలించి సంపన్న కుటుంబంతో మంచి సంబంధం ఖాయమవుతుంది.

5 / 6
ధనుస్సు: విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి, ప్రతిష్ఠాత్మక కంపెనీల్లో కోరుకున్న ఉద్యోగాన్ని సాధించడానికి తృతీయ రాహువు అవకాశాలనిస్తాడు. ఈ అవకాశాలను ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడానికి తరచూ అవకాశాలు లభిస్తాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాల్ని రాజీమార్గంలో పరిష్కరించుకుని లబ్ధి పొందుతారు. పిత్రార్జితం లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

6 / 6
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శని ఉన్నందువల్ల కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరి కలు చాలావరకు నెరవేరుతాయి. విదేశాల్లో ఉద్యోగాలకు ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రయత్నించడం చాలా మంచిది. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆస్తి వివాదాలు, ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది.