ధనస్సు రాశిలోకి సూర్యుడు.. ఏ రాశి వారికి కలిసి వస్తుందో తెలుసా?

Updated on: Nov 24, 2026 | 1:02 AM

సూర్యుడి సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే 2026 డిసెంబర్ 16న సూర్య భగవానుడు తన రాశిని మార్చుకోనున్నాడు. వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. దీని వలన ఐదు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5
ధనస్సులో సూర్యుడు మేష రాశి వారికి 9వ స్థానంలో సంచరిస్తాడు. దీనిని భాగ్య స్థానం అంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదులుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. విదేశీ ప్రయాణానికి అవకాశం, పితృ ఆస్తి విషయంలో శుభవార్త. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం.

2 / 5
మీన రాశి :మీన రాశి వారికి సూర్యుడు 10వ స్థానంలో, అంటే కర్మ స్థానంలో సంచరిస్తాడు. ఇది కెరీర్ కు అత్యంత అనుకూలమైన సమయం. ఉద్యోగంలో ఉన్నత పదవి, అధికారం లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో పెద్ద లాభం వస్తుంది. పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కోరిక నెరవేరుతుంది.

3 / 5
మిథున రాశి :ఈ రాశి వారికి సూర్యుడు 7వ స్థానంలోకి వస్తున్నాడు. వ్యాపార భాగస్వామ్యంలో లాభం వస్తుంది. కొత్త కాంట్రాక్టులు, కొత్త క్లయింట్లు దొరుకుతారు. ఉద్యోగంలో జీతం పెరిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

4 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి సూర్యుడు 4వ స్థానంలో సంచరిస్తాడు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు చేసే యోగం ఉంది. తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది. కొత్త వాహనం కొనే అవకాశం. గత కొంతకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గి, మనశ్శాంతి లభిస్తుంది.

5 / 5
తుల రాశి :తుల రాశి వారికి సూర్యుడు 3వ స్థానంలోకి రావడం చాలా శుభప్రదం. ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. సోదరుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం వస్తుంది. రచయితలు, మీడియా రంగం వారికి మంచి గుర్తింపు. చిన్న ప్రయాణాలు లాభాన్ని తెస్తాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us